X
కెవ్వు కేక
Comedy | Romance | 19 Jul 2013 | U/A |
Telugu

కెవ్వు కేక స్టోరీ

కెవ్వు కేక సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్‌, షర్మిలా మాండ్రే, ఆశిష్‌ విద్యార్థి, ఎమ్మెస్‌ నారాయణ, కృష్ణభగవాన్‌, సన, గీతాసింగ్‌, జ్యోతి, అపూర్వ తదితరులు ఈచిత్రంలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దేవి ప్రసాద్ నిర్వహించారు మరియు నిర్మాత బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చిన్ని చరన్, బీమ్స్ స్వరాలు సమకుర్చారు.

కథ 

బుచ్చి రాజు(అల్లరి నరేష్) కళానికేతన్ షోరూంలో సేల్స్ మేన్ జాబ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మహి(షర్మిల మాంద్రే)తో ప్రేమలో పడతాడు. అయితే మహి తండ్రి సుబ్బ రావు(ఎంఎస్ నారాయణ) వీరి పెళ్లికి ఒప్పుకోడు. తన కూతురును బాగా డబ్బున్న వాడికి ఇచ్చి చేయాలనేది ఆయన కోరిక. తాను డబ్బున్న వాడిని అని సుబ్బారావుని నమ్మించే ప్రయత్నం చేసి విఫలం అవుతాడు. దీంతో ఆరు నెలల్లో కోట్లు సంపాదించి మహిని పెళ్లి చేసుకోవడానికి వస్తానని సుబ్బారావుతో బుచ్చిరాజు చాలెంజ్ చేస్తాడు. డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుండగా బుచ్చి రాజుకు తన మామ అబ్రకదబ్ర అప్పారావు(కృష్ణ భగవాన్) ద్వారా ఓ విషయం తెలుస్తుంది.

గొట్టం గోపాల కృష్ణ(ఆశిష్ విద్యార్థి)చేతిలో తన తండ్రి మోసపోయాడని, గోపాలకృష్ణ నుంచి తనకు రావాల్సిన డబ్బు చాలానే ఉందని తెలుసుకుని అతని కోసం బ్యాంకాక్ వెళతాడు. మరి బుచ్చి రాజు తన ప్రయత్నంలో ఎలా సక్సెస్ అయ్యాడు? మహిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది తర్వాతి కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+