ముద్దుగా సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు విక్రాంత్, పల్లవి ఘోష్, చలపతిరాజు, మమతారెడ్డి, జానకీరామ్, లీలాకృష్ణ, సూర్య, కిశోర్, సృజన, మహిమ, నాని, భావన తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సతీష్ నిర్వహించారు మరియు నిర్మాత సి వి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ పి రామన్ స్వరాలు సమకుర్చరు.
కథ
మాధవ్(విక్రాంత్), కావేరి(పల్లవి ఘోష్) అనే ఇద్దరి ప్రేమ కథ. వారి మనస్సులో దాగి ఉన్న ప్రేమని ఆవిష్కరింప చేసే అది చిన్న కథనం. మాధవ్...ఓ ఎన్నారై...ఇండియాలో ఓ పల్లెకు తన స్నేహితుడు పెళ్లికి వస్తాడు. అక్కడ ఆ పెళ్లికి వచ్చిన కావేరి అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. అది రెండు రోజుల్లోనే ఒన్ సైడ్ లవ్ గా మారుతుంది. అతని ప్రేమకు స్నేహితులు సాయం చేస్తారు. అయితే ఇక్కడో ట్విస్టు ..ఆమెకు హర్ష(నాని) అనే బోయ్ ప్రెండ్ ఆల్రెడీ ఉంటాడు. అతను అమెరికాలో ఉంటాడు. అతన్ని కాదని ఆమె మనస్సు...మాధవ్ వైపు ఎలా తిరిగింది..ఈ క్రమంలో ఏయే పరిణామ క్రమాలు జరిగాయి అనేది మిగతా కథ.