X
నవాబ్
Action | 26 Sep 2018 | U/A |
Telugu

నవాబ్ స్టోరీ

నవాబ్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం త‌మిళంలో `చెక్క చెవంద వానం` పేరుతో రూపొందింది. తెలుగులో `న‌వాబ్‌` గా విడుద‌ల చేస్తున్నారు.  ఇందులో సిలంబరసన్, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్, జ్యోతిక, అదితి రావు హైదరి, దయాన ఎరప్ప, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు నటించారు. ఈ సినిమాని మణి రత్నం తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈచిత్రానికి సంగీతం ఎ ఆర్ రెహమాన్ అందించారు.

కథ

ఫ్యాక్షన్, రియల్ ఎస్టేట్ దందా నుంచి రాజకీయ నాయకుడైన భూపతిరెడ్డి (ప్రకాశ్ రాజ్), ఆయన సతీమణి (జయసుధ)పై హత్యాప్రయత్నం జరుగుతుంది. తండ్రిపై హత్యా ప్రయత్నం జరిగడంతో కుమారులు వరద (అరవింద స్వామి), బాల త్యాగరాజు ( అరుణ్ విజయ్), రుద్ర (శింబు) షాక్ అవుతారు. తన తండ్రిపై చిన్నప్ప (త్యాగరాజన్) వర్గమే హత్య ప్రయత్నం చేసిందని భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు చోటుచేసుకొంటుంది. ఆస్తి, అధికారం కోసం ముగ్గురి మధ్య విభేదాలు చోటుచేసుకొంటాయి. ఈ క్రమంలో భూపతిరెడ్డి గుండెపోటుతో మరణిస్తాడు. అదే సమయంలో రుద్ర భార్య ఛాయ సెర్బియా హత్యకు గురవుతుంది. బాల త్యాగరాజు భార్య దుబాయ్‌లో డగ్ర్ కేసులో అరెస్ట్ అవుతుంది. భూపతి రెడ్డి కుటుంబంలో జరిగిన అనేక సంఘటనలకు కారణం ఎవరు? చిన్నప్ప గౌడ్ వర్గమేనా ఈ చర్యలకు పాల్పడింది? ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరు పై చేయి సాధించారు? ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం వల్ల ఏం జరిగింది. ఈ కుటుంబ కలహాల్లో వరద ప్రాణ స్నేహితుడు రసూల్ (విజయ్ సేతుపతి) పాత్ర ఏంటి? వరద ప్రియురాలు (అదితిరావు హైదరీ) పాత్ర ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానమే నవాబ్ సినిమా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+