నిన్నే పెళ్లాడుతా సినిమా యాక్షన్, డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్), సిద్ధికా శర్మ, సాయికుమార్, ఇంద్రజ, సీత, సిజ్జు, మధు నందన్, గగన్ విహారి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వైకుంఠ బోను వహించారు. నిర్మాతలు: బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు నిర్మించారు. సంగీతం నవనీత్ అందించారు.
కథ
ప్రియ (సిద్దికా శర్మ) వైజాగ్‌లో మెడిసిన్ స్టూడెంట్. ప్రియను ఇష్టపడే అభిరామ్ (అమన్) ఆమె కోసం అదే కాలేజీలో మెడిసిన్ స్టూడెంట్‌గా చేరుతాడు. తొలుత అభిరామ్ అంటే ప్రియకు అసహ్యం. అయితే కొన్ని కారణాల వల్ల ప్రియ, అభిరామ్ దగ్గరవుతారు. కానీ ప్రేమను వ్యక్తపరుచుకోరు. అయితే అభిరామ్ ప్రేమ వ్యవహరం తెలిసిన తండ్రి ధనుంజయ్ (సాయికుమార్) తన కొడుకు హెచ్చరిస్తాడు. ప్రియురాలిని వదిలేసి రమ్మని వార్నింగ్ ఇస్తాడు. అయినా తండ్రి హెచ్చరికలను బేఖాతరు చేసి ప్రియతో ప్రేమ కోసం ఇంటి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ప్రియను, అభిరామ్‌ని చంపాలని ధనుంజయ్ ప్లాన్ చేస్తాడు. అభిరామ్‌ను అసహ్యించుకొనే ప్రియ అతడికి ఎలా దగ్గరైంది. తమ మనసులోని ప్రేమను వారిద్దరు ఎందుకు వ్యక్త పరుచుకోరు. తన కొడుకును, అతడి లవర్‌ను ధనుంజయ్ ఎందుకు చంపాలని అనుకొంటాడు. ఈ కథలో సరోజిని (ఇంద్రజ) ఎవరు? సరోజిని, ధనుంజయ్‌కి సంబంధం ఏమిటి? అభి, ప్రియల ప్రేమకు సరోజిని ఎలా అడ్డంకిగా మారింది. చివరకు అభి, ప్రియల ప్రేమ సుఖాంతం అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే.. నిన్నే పెళ్లాడుతా.