Double Ismart Song Review: కిరికిరి మాక్కి కిరికిరి.. స్టెప్పామార్ అంటూ అదరగొట్టిన రామ్!
ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. పూరి కనెక్ట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్ాడరు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోష్ పెంచేందుకు తొలి సాంగ్‌ను రిలీజ్ చేాశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఆ సాంగ్ ఎలా ఉందంటే..
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మ్యాజికల్ కంపోజర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమో అందర్నీ ఆకట్టుకొన్నది. ఈ సినిమాలోని స్టెప్పా మార్ పాటను జూలై 1న రిలీజ్ చేస్తున్నామని రిలీజ్ చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఫుల్ వెర్షన్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఆ పాట ఎలా ఉందనే వివరాల్లోకి వెళ్దాం..
భారీ శివుడు విగ్రహం ముందు హీరో రామ్ పోతినేని వేసిన స్టెప్పులు.. ఆయన లుక్ క్రేజీగా కనిపించింది. ఈ పాట రామ్ చెలరేగి పోయి మాస్ స్టెప్పలు ఆడియెన్స్‌ను, అభిమానులను ఆకట్టుకొంటున్నాయి. ఈ పాటను భాస్కర భట్ల రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. విడుదలైన కొద్ది గంటల్లోనే 2 మిలియన్ల వ్యూస్ సాధించింది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి
రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్
సీఈవో: విషు రెడ్డి
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్: శ్యాకే నాయుడు, గియాని
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
రిలీజ్ డేట్: 2024-06-01


Click it and Unblock the Notifications











