కొనసాగుతున్న ఇస్మార్ట్ జోరు.. వంద మిలియన్ల దిమ్మాక్ ఖరాబ్
ఒక్క సినిమా ఎందరి జీవితాన్నో మార్చేసింది. డైరెక్టర్‌గా పని అయిపోయింది, నిర్మాతగానూ కెరీర్ ముగిసిందని, హీరోయిన్లు ఫేడ్ అవుట్, హీరోకూ సరైన్ హిట్ లేదు.. ఇలా అందరూ కలిసి చేసిన చిత్రమే ఇస్మార్ట్ శంకర్. డైరెక్టర్‌గా పూరీ, నిర్మాతగా ఛార్మీ, పూరిలకు, హీరోయిన్ నిధి అగర్వాల్‌కు, హీరో రామ్‌కు వారి వారి కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా మిగిలిపోయింది. ఇస్మార్ట్ ఇచ్చిన హిట్‌లో వీరంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ జోష్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఇస్మార్ట్ శంకర్‌లో అన్నింటి కన్నా, అందరి కన్నా ముందు చెప్పుకోవాల్సింది మణిశర్మ గురించే. సంగీత దర్శకుడిగా మణిశర్మ పని కూడా అయిపోయిందని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలోనే ఇస్మార్ట్ శంకర్‌తో ప్రేక్షకులను ఊపేశాడు. ఈ సినిమాలోని సంగీతం, నేపథ్య సంగీతం, పాటలు మరో లెవెల్. పాటలైతే ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పేరుకి మెలోడి బ్రహ్మ అయినా.. మాస్ బీట్స్‌తో అందర్నీ కట్టిపడేశాడు.

అన్ని పాటల్లో కెల్లా.. దిమ్మాక్ ఖరాబ్ పాట నిజంగాక్ కుర్రాళ్ల దిమ్మాక్‌ను ఖరాబ్ చేసేసింది. మాస్ బీట్ ఒకెత్తు అనుకుంటే.. ఈ పాటకు వేసిన స్టెప్పులు, కొరియోగ్రఫీ, ఇద్దరి భామలు హాట్ హాట్ అందాలు విజువల్ ట్రీట్‌ను ఇచ్చాయి. అందుకే వీడియో సాంగ్ యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయగానే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. తాజాగా ఈ పాట వంద మిలియన్లను క్రాస్ చేసేసి సత్తా చాటింది. ప్రస్తుతం దిమ్మాక్ ఖరాబ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











