Double ISMART: రామ్ కోసం సరైనోడినే దింపిన పూరీ.. పవన్, మహేశ్, చరణ్, ప్రభాస్‌లను వాడుతూ!

ఈ మధ్య కాలంలో తెలుగులో హిట్ సినిమాలకు సీక్వెల్స్ బాగానే వస్తున్నాయి. అలాంటి చిత్రాలే ఆరంభం నుంచీ హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. తద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు మార్కెట్‌ను ఏర్పరచుకుంటున్నాయి. ఇప్పుడు అలా రాబోతున్న చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి ఇది కొనసాగింపుగా వస్తున్న విషయం తెలిసిందే.

'ఇస్మార్ట్ శంకర్' హిట్ అయిన వెంటనే రామ్ పోతినేని హీరోగా 'డబుల్ ఇస్మార్ట్' మూవీని చేస్తామని అప్పట్లోనే దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించాడు. కానీ, ఎవరికి వాళ్లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు షురూ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఉస్తాద్ రామ్ - పూరీ జగన్నాథ్ కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' రాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. అంతేకాదు, దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఆ వెంటనే ముంబైలో ఓ షెడ్యూల్‌ను కూడా కంప్లీట్ చేసేసింది.

Mani Sharma Onboard for Ram Pothineni Double ISMART Movie

బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగానే సాగుతోంది. ఇందులో హీరో రామ్‌తో పాటు కీలక పాత్రను చేస్తున్న పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ చాలా టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

పూరీ జగన్నాథ్ సినిమాల్లో మ్యూజిక్ ఆల్బమ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాజిక్‌కు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మే కారణం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' కోసం కూడా మణి శర్మకే పూరీ జగన్నాథ్ ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు వినూత్నంగా ఆలోచించి ఓ వీడియోను రూపొందించారు. అందులో గతంలో వీళ్ల కాంబోలో హిట్లైన పాటలను ప్లే చేశారు.

ఇదిలా ఉండగా.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X