Deepika Padukone గ్లామర్ షోతో హద్దు మీరిన దీపిక.. హృతిక్‌తో శృంగార విన్యాసాలు.. నెటిజన్ల ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ మరోసారి వివాదంలో ఇరుక్కొన్నది. గతంలో పఠాన్ సినిమా సమయంలో ఓవర్ డోస్ శృంగారంతో షారుక్ ఖాన్‌తో స్టెప్పులు వేసిన ఈ అందాల భామ తాజాగా మరోసారి హృతిక్ రోషన్ సినిమా ఫైటర్‌లో అంగాంగ ప్రదర్శన చేయడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇటీవల రిలీజ్ చేసిన పాటలో ఆమె ధరించిన దుస్తులు, దీపిక వేసిన స్టెప్పులు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే దీపిక శృంగార విన్యాసాలపై నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారనే విషయంలోకి వెళితే..
బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి దీపిక పదుకోన్ జంటగా నటిస్తున్నది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఇష్క్ జల్సా కుచ్ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను విశాల్ , శేఖర్, శిల్పా రావు, మెల్లో డీ కలిసి పాడారు. అయితే మెలోడిగా సాగిన ఈ పాటలో హృతిక్, దీపిక మధ్య పండిన కెమిస్ట్రీ కాస్త మోతాదు మించింది అనే కామెంట్లు మీడియాలో వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో వస్తున్న ఫైటర్ సినిమా యాక్షన్, రొమాంటిక్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమాపై ప్రమోషనల్ ఈవెంట్స్ ఇప్పటికే భారీగా అంచనాలు పెంచాయి. అయితే ఇష్క్ జల్సా కుచ్ అనే పాటలో రంగు రంగుల బికినీలో దీపిక శృంగార అవతారాన్ని ప్రదర్శించింది.
విదేశాల్లో బీచ్ పార్టీ సాంగ్‌గా ఇష్క్ జల్సా కుచ్ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో సిక్స్ ప్యాక్‌లో హృతిక్ రోషన్ తన దేహాదారుఢ్యాన్ని ప్రదర్శించగా.. బికినీలో దీపిక పడుకోన్ యదేచ్చగా తన అందాలను స్క్రీన్‌పై ఆరబోసింది. ఆమె గ్లామర్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవ్వగా.. కొందరు ఏమిటి ఇంత హద్దు మీరిన గ్లామర్ అవసరమా? అని నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.

Prabhast Net Worth సలార్ హిట్ తర్వాత ప్రభాస్ ఆస్తుల విలువ ఎంత? టాప్ 100 లిస్టులో రెబల్ స్టార్!
ఇటీవల కాఫీ విత్ కరణ్‌లో దీపిక పదుకోన్, తన భర్తతో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి హాజరైంది. ఈ షోలో ఏ హీరోతో ఎక్కువగా కెమిస్ట్రీ పండింది అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. హృతిక్ రోషన్ అని చెప్పింది. ఫైటర్ సినిమాలో ఆయనతో చేసిన సీన్లు హాట్ హాట్‌గా ఉంటాయి అని దీపిక చెప్పడం చూస్తే.. ఫైటర్‌లో దృశ్యాలు ఆ రేంజ్‌లోనే కనిపించాయి.


Click it and Unblock the Notifications











