నా భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం.. అతడి వల్లే నా జీవితం దుర్బరం.. సింగర్ కౌసల్య
సింగర్ కౌసల్య అనగానే అప్పట్లో దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి స్వరకల్పనలో ఆమె పాడిన తీయనైన పాటలు ఎన్నో గుర్తొస్తాయి. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ సింగర్ గా వెలుగొందిన కౌసల్య ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో పెద్దగా పాటలు పాడట్లేదు. అయితే కౌసల్య ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. భర్త అక్రమ సంబంధం, విడాకులు, అద్దె ఇంట్లో జీవితం... ఒకప్పుడు స్టార్ సింగర్ గా వెలుగొందిన ఆమె ఆ తరువాత అవకాశాలే లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరి ఇంతకీ ఆ సింగర్ ఎవరో మనమూ తెలుసుకుందాం పదండి.
1999లో నీకోసం మూవీతో సింగర్ గా ప్రారంభించింది కౌసల్య. ఆ తర్వాత ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, నువ్వు లేక నేను లేను, శివమణి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గంగోత్రి, సత్యం, దేవదాస్, దేశముదురు, చక్రం, నువ్వే నువ్వే, చెన్నకేశవరెడ్డి, శ్రావణమాసం, ఢీ, కృష్ణ, మస్కా, సింహ, గోలీమార్, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలో పాటలు పాడి ఆకట్టుకుంది.

ఇక హీరోయిన్ కళ్యాణికి కూడా అప్పట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసింది కౌసల్య. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో నటిగా కూడా ఎంట్రీ ఇచ్చింది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా తనలోని మల్టీ టాలెంట్ ను బయట పెట్టింది.
కౌసల్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కౌసల్య చాలా సందర్భాల్లో తన భర్త చిత్రహింసలు పెట్టేవాడని తెలిపింది. అయితే కేవలం తన కొడుకు కోసమే అతను ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించాను అని చెప్పిన ఈ సింగర్ సొంత ఇష్టాలకు దూరంగా ఉండాలంటూ తనపై భర్త ఒత్తిడి చేసేవాడని చెప్పుకొచ్చింది.

తనకు ఇంట్లో ఏమాత్రం స్వేచ్ఛ ఉండేది కాదని, భర్తతో పాటే అతని కుటుంబ సభ్యులు కూడా కష్టాలు పెట్టే వారంటూ బోరున విలపించింది కౌసల్య. అంతేకాకుండా తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందంటూ, అందువల్లే తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చానని చెప్పి షాక్ ఇచ్చింది.
అలాగే భర్త తనను వదిలి వెళ్ళిపోవడంతో కొడుకును తానే పెంచి పెద్ద చేశానని, ప్రస్తుతం పెద్దయిన కొడుకు తనను రెండో పెళ్లి చేసుకోమంటున్నాడు, ఒంటరిగా ఉండకుండా తోడును చూసుకోమంటున్నాడు అని చెప్పి సంచలనం సృష్టించింది. ఇక 400లకు పైగా పాటల్లో పాడిన ఈ అమ్మడు అద్దె ఇంట్లోనే నెట్టుకొస్తుంది.

అప్పట్లో స్టార్ సింగర్ అయినప్పటికీ తనకు డబ్బును ఎలా దాచుకోవాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియకపోవడంతో వచ్చిన డబ్బునంత వృధా చేసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందుకే ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను అని జీవితం తనకు నేర్పిన పాఠాలను వివరించింది.
ఎవరైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తనకు ఈ విషయం అనుభవపూర్వకంగా అర్థమైందని చెప్పుకొచ్చింది. ఒకానొక సందర్భంలో ఆఫర్లు లేక ఎవరైనా ఏం చేస్తున్నావ్ అని అడిగితే సమాధానం కూడా ఉండేది కాదని, ఆ తర్వాతే తను మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేశానని వివరించింది. మొత్తానికి స్టార్ సింగర్ గా ఓ వెలుగు వెలిగిన కౌసల్య ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేక నటన వైపు మొగ్గు చూపుతోంది.


Click it and Unblock the Notifications











