Ram Charan జరగండి సాంగ్‌తో మళ్లీ తమన్ అడ్డంగా బుక్ ... ఆ సినిమా ట్యూన్ లేపేశారుగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు. ఇక చెర్రీ బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక చెర్రీ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఓ పాట రిలీజ్ అయింది. ఇక శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇక జరగండి సాంగ్ ఇప్పటికే ఓ ఊపు ఊపేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇది కాపీ ట్యూన్ అంటూ నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. ఒరిజినల్ సాంగ్, ఈ సాంగ్ ట్యూన్స్ కంపైర్ చేస్తూ వీడియోలు పోస్టులు పెడుతున్నారు. అసలు నిజంగానే ఈ ట్యూన్ కాపీనా.. తమన్ మళ్లీ కాపీ కొట్టాడా అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.

గ్లోబర్ స్టార్ స్థాయికి...
మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఒక్కో మెట్టు ఎదుగుతూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరింత క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య సినిమా చేసిన చరణ్.. అది ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. ఆ తర్వాత లెజెండరీ డైెరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయ్యి రెండేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు ఓ అప్డేట్ రాలేదు.

SS Thaman Copy Tune For RamCharan Game Changer Jaragandi Song From NTR Sakthi Surro Surra Song Full Details Here

బర్త్ డే స్పెషల్ సర్ ప్రైజ్...
ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో చెర్రీకి జోడీగా అందాల భామ కియారా అద్వానీ నటిస్తుంది. వీరు గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి వీరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.

జరగండి అంటూ...
అసలు ఈ పాట గత ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే చరణ్ పుట్టినరోజు కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక డాలర్ మెహెన్ది, సునిధి చౌహన్ పాటను అలపించారు. ప్రభుదేవా డాన్స్ కోరియోగ్రఫీ చేయగా... రామ్ చరణ్ అండ్ కియారా అద్వానీ మరోసారి తమ స్క్రీన్ ప్రేజేన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక శంకర్ స్టాండర్డ్ విజన్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా తెరకెక్కించారు.

SS Thaman Copy Tune For RamCharan Game Changer Jaragandi Song From NTR Sakthi Surro Surra Song Full Details Here

మళ్లీ దొరికి పోయిన తమన్...
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... ఇప్పుడు ఈ పాట గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద ట్రోలింగ్ మొదలు అయింది. ఈ పాట కాపీ ట్యూన్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక ట్యూన్స్ విషయంలో అడ్డంగా దొరికిపోయిన తమన్... ఇప్పుడు రామ్ చరణ్ 15వ సినిమా గేమ్ చేంజర్ జరగండి పాట విషంలో కూడా మళ్లీ దొరికిపోయాడు. ఒకప్పుడు సోషల్ మీడియా అంతగా అందుబాటులో లేని సమయంలో ఇలాంటి విషయాలు బయటకు రాకపోయేవి.

HBD RamCharan రామ్ చరణ్ బర్త్ డే... గొప్ప సాహసం చేసిన సురేఖ.. ఏం చేశారో తెలిస్తే?

ఆ పాటకు కాపీ ట్యూన్ లా....
కానీ ఇప్పుడు ఎక్కడ నుంచి కాపీ ట్యూన్ తెచ్చారు అనే విషయాన్ని నెటిజన్స్ వెంటనే కనిపెట్టేస్తున్నారు. ఇక జరగండి సాంగ్ గమనిస్తే... ఆ పాట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రంలోని సాంగ్ అని తెలుస్తుంది. ఇలియానా, ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రంలోని Surro Surra (సుర్రో సుర్రా సూరీడే) పాటలోని ట్యూన్ అని వింటే అర్థం అవుతుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఈ పాటలోని ఓ ట్యూన్ లేపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పాటలను కంపైర్ చేస్తూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మీరు ఆపాటలను విని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X