HBD RamCharan రామ్ చరణ్ బర్త్ డే... గొప్ప సాహసం చేసిన సురేఖ.. ఏం చేశారో తెలిస్తే?

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కోడలు ఉపాసనతో కలిసి ఇటీవల సురేఖ అత్తమ్మస్ కిచెన్ అని కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఎవరూ చేయని సాహసం చేస్తుంది సురేఖ. కొడుకు పుట్టిన రోజు సందర్భంగా అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది సురేఖ. ఓ వీడియోను విడుదల చేసి.. షాకింగ్ విషయం తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే....

బాధ్యతలు నిర్వహిస్తూ...
చిరంజీవి సతీమణీ, రామ్ చరణ్ తల్లి సురేఖ.. ఎంత సింపుల్ గా ఉంటారో తెలిసిందే. ఎక్కువగా మీడియాలో కనబడకపోయినా.. భర్త చాటు భార్యగా, అప్పుడప్పుడు కొడుకు, కోడలితో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంది. అల్లు రామలింగయ్య వారసురాలు అయినటువంటి సురేఖ.. మెగాస్టార్ చిరంజీవితో వివాహం తర్వాత జీవితం మొత్తం ఫ్యామిలీకి అంకితం ఇచ్చేసి.. తల్లిగా, అత్తగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తుంది.

Chiranjeevi Wife Surekha distributed food to 500 people on the occasion of Ram Charan s birthday Full Details Here

అత్తా కోడళ్లు కలిసి...
అయితే ఆ మధ్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా కోడలు ఉపాసన ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ ను ప్రారంభించింది మెగాకోడలు. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మ కిచెన్ ప్రారంభించి.. అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు సురేఖ, ఉపాసన.

రామ్ చరణ్ కోసం...
ఇక రేపు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్బంగా సురేఖ ఎవరు చేయని పనిని చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేశారని చెప్పవచ్చు. చరణ్ బర్త్ డే సందర్భంగా సురేఖ కొణిదెల గారు అత్తమ్మ కిచెన్ నుండి అన్నదానం నిర్వహించారు. స్వయంగా సురేఖ వండిన ఆహారాన్ని... 500 మంది భక్తులకు వండించింది. చిన జీయర్ స్వామి ఆశీస్సులతో అపోలో హాస్పిటల్స్ ఆలయ పుష్కరోత్సవంలో 500 మందికి పైగా భక్తులు ఆమె రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించారు.

Chiranjeevi Wife Surekha distributed food to 500 people on the occasion of Ram Charan s birthday Full Details Here

వీడియో వైరల్...
ఇక సురేఖ ఈ విషయాన్ని తన అత్తమ్మస్ కిచెన్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పంచుకున్నారు. అందులో ఎంతో మంది భక్తులు ఈ ఆహారాన్ని ఆస్వాదించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. 500 మందికి వండటం అంటే చాలా గొప్ప పని అంటూ కామెంట్ చేస్తున్నారు. పెద్ద సాహసమే చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

OTTలోకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

కొణిదెల వంటకాలు
ఇక కొణిదెల వారి వంటకాలను"అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకోగా.. ఈ ఫుడ్ ప్రాడెక్ట్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ 'అత్తమ్మ కిచెన్' ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపుతుందని చెప్పుకువస్తున్నారు. మరి మీరు ఈ ఫుడ్ టెస్ట్ చేసి ఉంటే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X