ట్రెండ్ సెట్టర్‌గా పోకిరి ఆల్బమ్.. అందులో తమన్ పాత్ర ఎంతంటే..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో పోకిరి ట్రెండ్ అవుతోంది. నేటికి పోకిరి విడుదలై పద్నాలుగేళ్లు అవుతోంది. ఇండస్ట్రీ హిట్ పోకిరికి పద్నాలుగేళ్లు అంటూ సినీ ప్రేమికులు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ సెలెబ్రిటీలు కూడా నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. దర్శకుడు పూరి జగన్నాద్, ఛార్మీ వంటివారు సినిమా విశేషాలను పంచుకున్నారు.
పోకిరి అంత పెద్ద హిట్ కావడానికి పూరి జగన్నాద్, మహేష్ బాబు ఎంత కారణమో.. సంగీతమందించిన మణిశర్మ కూడా అంతే కారణం. పోకిరి ఆల్బమ్ అప్పట్లో ఓ పెను సంచలనం. యూత్‌లో పోకిరి పాటలకు ఓ రేంజ్ డిమాండ్ ఉండేది. క్యాసెట్లు, సీడీలు కుప్పలు తెప్పలుగా అమ్ముడుపోయేవి. అంతటి సెన్సేషనల్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గ్యాంగ్‌లో తమన్ కూడా ఉన్నాడట.

తమన్ అనేవాడు మణిశర్మ శిష్యుడన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మణిశర్మ పని చేసిన ఎన్నో చిత్రాలకు తమన్ అసిస్టెంట్‌గా ఉండేవాడు. పోకిరి ఆల్బమ్‌పై తమన్ స్పందిస్తూ.. 'ఓ అద్భుతమైన ఆల్బమ్, నా గురువు మణిశర్మ గారు చించేశారు.. అదిరిపోయే టాప్ క్లాస్ పరికరాలతో కొత్త శబ్దాలను కసితో పుట్టించాము.. పోకిరి అనేది మొత్తంగా కొత్త ప్రయోగం.. ఈ చిత్రం కోసం ప్రతీ ఒక్కటి కలిసి వచ్చింది.. లెజెండ్‌తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంద'ని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











