'లోఫర్‌' ట్రైలర్‌ రికార్డ్...పూరీ ధాంక్స్

By Srikanya

హైదరాబాద్‌: పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం 'లోఫర్‌'. ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్‌ను పది లక్షల మందికి పైగా ఆన్‌లైన్‌లో చూసారు. ఇందుకుగాను దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

1 Million views so far for Loafer Trailer thank you guys !!

Posted by Puri Jagannadh on 17 November 2015

సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రంలో రేవతి, పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ ట్రైలర్ ని మరోసారి చూడాలంటే ఇక్కడ చూడండి.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''వరుణ్‌ తొలిసారి చేస్తున్న మాస్‌ సినిమా ఇది. యాక్షన్‌తో పాటు, సెంటిమెంట్‌కీ ప్రాధాన్యం ఉంది. కథానుసారమే టైటిల్‌ నిర్ణయించాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు.

1 Million views so far for Puri's Loafer Theatrical Trailer

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది.

బ్రహ్మానందం, రేవతి, పోసాని, ముఖేష్‌ రుషి, సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి, పవిత్రలోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌ తదితరులు నటించారు. సంగీతం: సునీల్‌ కశ్యప్‌. ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X