అందరూ అదే అడుగుతున్నారు.. దానికీ ఓ టైమ్ వస్తుంది: అనుష్క రియాక్షన్ చూస్తే..

'సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ సూపర్ సక్సెస్ సాధించింది. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన 15 సంవత్సరాల సినీ జర్నీ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తన పెళ్లి విషయమై అనుష్క ఆసక్తికరంగా మాట్లాడింది. వివరాల్లోకి పోతే..

పదిహేనేళ్ల ప్రయాణం.. ప్రముఖులంతా హాజరు

పదిహేనేళ్ల ప్రయాణం.. ప్రముఖులంతా హాజరు

2005 సంవ‌త్స‌రంలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క.. తన 15 సంవ‌త్స‌రాల వెండితెర ప్రయాణం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

దర్శకనిర్మాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు

దర్శకనిర్మాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు


ఈ వేదికపై మాట్లాడిన అనుష్క.. పదిహేనేళ్ల అనుభవం తనపై బాధ్యత పెంచిందని చెప్పింది. తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా తనకు సినిమా అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ జర్నీ ఎంజాయ్ చేశానని పేర్కొంది.

దానికీ ఓ టైమ్ వస్తుంది.. పెళ్లిపై అనుష్క రియాక్షన్

దానికీ ఓ టైమ్ వస్తుంది.. పెళ్లిపై అనుష్క రియాక్షన్

ఇకపోతే ఈ మధ్యకాలంలో అనుష్క పెళ్లి మ్యాటర్ నిత్యం చర్చల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క పెళ్లి ఖాయమైందని, వరుడు అతనే అంటూ పలువురి పేర్లు పెట్టి పెళ్లి వార్తలు రాసేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ఈ ఇస్సుపై సభ వేదికపైనే నోరు విప్పింది అనుష్క. అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారని, తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, టైమ్ వస్తే అందరికీ తెలుస్తుందని చెప్పింది.

Recommended Video

Anushka Shetty Open Up On Dating A Cricketer | Filmibeat Telugu
అనుష్క నిశ్శబ్దం

అనుష్క నిశ్శబ్దం


ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్, షాలినీ పాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ పతాకాలు సంయుక్తంగా ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X