మెహబూబాలో ఆకాష్ పాత్ర ఇదే. కొడుకును డిఫరెంట్ గా చూపించిన పూరి జగన్నాధ్!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా నిర్మిస్తున్నాచిత్రం 'మెహబూబా'. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను అలరించింది. మే 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ లో ఈ చిత్ర షూటింగ్ అధికభాగం జరిగింది. ప్రేమకథకు గత జన్మలను జోడించి తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో జరిగిన రొమాంటిక్ ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతోంది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరో ఆకాష్ కు కొండలు, పర్వతాలు ఎక్కే హాబి ఉంటుందని సమాచారం. నేచర్ లవర్ గా ఆకాష్ కనిపించబోతున్నాడు. మంచు పర్వతాలు ఎక్కుతూ కనిపించే ఆకాష్ హీరోయిన్ ప్రేమలో ఎలా పడ్డాదనేని ఆకక్తికరంగా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాతో పూరి బ్యాక్ అవుతాడని అంటున్నారు చాలా మంది.


Click it and Unblock the Notifications











