మాస్‌కు పర్యాయపదంలా ఆ హీరో.. పూరి జగన్నాథ్ హై వోల్టేజ్ ఇప్పుడే చూశా
ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేయాలని ఇద్దరూ ఒక్కటయ్యారు. తమ టాలెంట్ ఏంటో చూపించి పూర్వవైభవం పొందేందుకు గాను సెట్స్‌పై ఎంతో చురుకుగా కదులుతున్నారు. ఈ మేరకు 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో ప్రేక్షకలోకానికి ఓ డిఫెరెంట్ మూవీ చూపించేందుకు సిద్ధమయ్యారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విభిన్న కథాంశంతో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం రూపొందుతోంది. చిత్రంలో రామ్ మునుపెన్నడూ కనిపించని లుక్‌లో దర్శనమీయనున్నాడు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోవా, హైదరాబాద్ లోని పలు సుందరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనుంది.
ఈ చిత్ర ఫస్ట్‌లుక్ మొదలుకొని ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌ట్స్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా హీరో రామ్ పుట్టిన రోజును పురస్కరించుకొని మే 15 న ఈ చిత్ర టీజర్ విడుదల చేయబోతున్నారు. కాగా విడుదలకు ముందే ఈ టీజర్ చూసిన నటుడు సత్యదేవ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ''బాస్ పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ హై వోల్టేజ్‌ను ఇప్పుడే చూశా .. టీజర్ చూస్తుంటే హీరో రామ్ చెడుకు పర్యాయపదంలా అనిపించాడు. రామ్ పుట్టినరోజు కోసం కట్ చేసిన టీజర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఇది పూరీ, రామ్ అభిమానులకు ట్రీట్ లాంటిది'' అని పేర్కొన్నారు.

ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ చిందులేస్తున్నారు. సినిమాలోని ఐటెం సాంగ్ కి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఈ ఇద్దరు భామల లుక్స్ చిత్రంలో అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉండనుందో చెప్పకనే చెప్పేశాయి. మొత్తానికైతే విడుదలకు ముందే ఇంత హైప్ తెచ్చుకోవడం చూస్తుంటే విడుదలయ్యాక ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











