ఆయనకు దగ్గరవుతా.. అందుకే ట్విట్టర్ ఖాతా తెరిచా: శ్రీరెడ్డి
క్యాస్టింగ్ కౌచ్ అంశంతో టాలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తున్న శ్రీరెడ్డి మరో ఆసక్తికరమైన సోషల్ మీడియాలోని ట్విట్టర్‌లోకి ప్రవేశించారు. 'శ్రీ శక్తి' పేరుతో తాను ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లోనే దుమ్మురేపిన ఈ నటి తాజాగా ట్విట్టర్‌లో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇటీవల మా అసోసియేషన్‌పై నిరసన వ్యక్తం చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం జాతీయ మీడియాలో సంచలనం రేపింది. ఇలా వివాదాలతో ముందుకెళ్తున్న శ్రీరెడ్డి.. ఏకంగా మంత్రి కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేసింది.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కి చేరువయ్యేందుకే ట్విట్టర్ అకౌంట్ తెరిచాను. త్వరలో కేటీఆర్ అపాయింట్‌మెంట్ పొందేందుకే ఖాతాను తెరిచినట్టు ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను వ్యతిరేకించినందుకు తాను శిక్ష అనుభవిస్తున్నాను. ఈ సమాజంలో కలిసిపోయే విధంగా తన పాత జీవితాన్ని తనకు తిరిగి ఇప్పించాలని మంత్రి కేటీఆర్‌ను శ్రీరెడ్డి కోరింది.


Click it and Unblock the Notifications











