»   » ఇరుక్కుంటున్నారు: డ్రగ్స్ హైదరాబాద్ లో మామూలే, నోరువిప్పిన తరుణ్, రవితేజ నవదీప్‌ల వంతు రేపే

ఇరుక్కుంటున్నారు: డ్రగ్స్ హైదరాబాద్ లో మామూలే, నోరువిప్పిన తరుణ్, రవితేజ నవదీప్‌ల వంతు రేపే

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ హైదరాబాద్ పబ్బుల్లో కొత్తేమీ కాదనీ,హైదరాబాద్‌లోని 15 పెద్ద పబ్బుల్లో డ్రగ్స్‌ దందా నడుస్తోందని హీరో తరుణ్‌ వెల్లడించినట్టు సమాచారం. డ్రగ్స్‌ తీసుకునేందుకు ఈవెంట్‌ మేనేజర్లు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారని, తరచూ పబ్‌లకు వచ్చే వారిలా కాకుండా.. సెలబ్రిటీలకు ప్రత్యేక గదుల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తుంటారని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే తాను మాత్ర ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, అసలు సరఫరా చేయలేదని సిట్ బృందానికి చెప్పాడట తరుణ్. హైదరాబాద్‌లోని పబ్బుల్లో డ్రగ్‌ కల్చర్, వాటికి ఎక్కడి నుంచి డ్రగ్‌ వస్తుంది? ఎలా డీల్‌ చేస్తారు? గతంలో తరుణ్‌ సొంతంగా పబ్‌ నిర్వహించిన అంశాలపై ఎక్కువగా సిట్ ప్రశ్నలున్నట్టు సమాచారం...

ఆన్ పబ్

ఆన్ పబ్

లవర్ బోయ్ తరుణ్ కి సినిమా కెరీర్ ఆశాజనకంగా లేదు. అందుకేనేమో కనీసం పబ్ అయినా పెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుని 'ఆన్ పబ్" ఆరంభించాడు. అయితే ఈ పబ్ ను ఇటీవల 2010 లోనే అమ్మేసి స్లీపింగ్ పార్ట్నర్ గా కొన్నాళ్ళు కొనసాగి తర్వాత అక్కన్నుంచి కూడా తప్పుకున్నాడన్నది ఇప్పటికి తెలిసిన సమాచారం..

Puri Jagannadh And Ravi Teja facing problems with drugs issue
రవితేజ సోదరులు భరత్, రఘు

రవితేజ సోదరులు భరత్, రఘు

రవితేజ సోదరులు భరత్, రఘు మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తూ పట్టుబడిన తర్వాత సినిమా పరిశ్రమలో ఈ బాపతుకి చెందిన వారు చాలామంది ఉన్నారని పోలీసులు అంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న పది ప్రముఖ పబ్స్ లో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతోందని, రెడ్ హ్యాడెండ్ గా పట్టుకుంటామని కూడా అప్పట్లో పోలీసులు కొంత హల్ చల్ చేసారు... దాంతోనే తరుణ్ అక్కడి నుంచి తప్పుకున్నాడు అంటారు.

గోవాకు వెళ్లే వారంతా డ్రగ్స్‌ తీసుకున్నారనుకుంటే ఎలా

గోవాకు వెళ్లే వారంతా డ్రగ్స్‌ తీసుకున్నారనుకుంటే ఎలా

తరుణ్‌ పదే పదే గోవాకు వెళతారని, అక్కడ డ్రగ్స్‌ తీసుకుంటారని.. ఇందుకు జీశాన్, కెల్విన్‌లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపైనా సిట్‌ బృందాలు ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో గోవాకు వెళ్లే వారంతా డ్రగ్స్‌ తీసుకున్నారనుకుంటే ఎలాగని తరుణ్‌ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది.

అందులో భాగంగానే గోవా

అందులో భాగంగానే గోవా

తన స్నేహితులకు గోవాలో హోటళ్లు, రెస్టారెంట్‌ వ్యాపారాలు ఉన్నాయని.. వాటిలో తనకూ వాటాలు ఉన్నాయని, అందులో భాగంగానే గోవా వెళుతుంటానని చెప్పినట్లు సమాచారం. ఉపవాసం వల్ల ఆహారం తీసుకోవటానికి నిరాకరించిన తరుణ్ కోసం దీంతో అధికారులు యాపిల్స్, జ్యూస్‌ తెప్పించి ఇచ్చినట్లు సమాచారం.

రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు

రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు

ఇక సాయంత్రం సమయంలో ఉస్మానియా వైద్య బృందం తరుణ్‌ రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు సేకరించినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కాగా ఉదయం 10.15 గంటలకు విచారణ మొదలుకాగా.. రాత్రి 11.40 గంటలకు తరుణ్‌ను బయటికి పంపించారు. అంటే సుమారు పదమూడున్నర గంటల పాటు సిట్‌ విచారణ సాగింది.

హీరో రవితేజ, నవదీప్

హీరో రవితేజ, నవదీప్

కొన్ని మీడియా సంస్థలు అందిస్తున్న వార్తల ప్రకారం.. విచారణలో జీషన్ అలీ.. సినీ ప్రముఖులతో తనకున్న సంబంధాల గురించి వెల్లడించినట్లుగా చెబుతున్నారు. హీరో రవితేజ.. ఒకప్పటి హీరో నవదీప్ జీషన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా సిట్ ఎదుట చెప్పినట్లుగా సమాచారం.

జీషన్ అలీ రవితేజకు ఇచ్చేవాడని

జీషన్ అలీ రవితేజకు ఇచ్చేవాడని

దీనికి సంబంధించిన ఆధారాల్ని సిట్ సేకరించినట్లుగా తెలుస్తోంది. జీషన్ అలీ సౌత్ ఫ్రికా నుంచి డ్రగ్స్ తెచ్చి రవితేజకు ఇచ్చేవాడని.. వాటిని ఆయన సరఫరా చేసేవాడన్న వార్త ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రవితేజతో పాటు.. నవదీప్ కూడా జీషన్ అలీ డ్రగ్స్ సరఫరా చేసే వాడని చెబుతున్నారు.

డ్రగ్స్ రాకెట్ లో కెల్విన్ తర్వాత కీలక పాత్ర

డ్రగ్స్ రాకెట్ లో కెల్విన్ తర్వాత కీలక పాత్ర

ఇందుకు సంబంధించిన ఆధారాల్ని సిట్ కొంతమేర సేకరించినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ రాకెట్ లో కెల్విన్ తర్వాత కీలక పాత్ర జీషన్ అలీదేనని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెల 25న రవితేజను సిట్ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్‌ కేసు విచారణలో ఆదివారం విరామం ఇచ్చా రు. సోమవారం నవదీప్, మంగళవారం రవితేజ, బుధవారం చార్మి, గురువారం ముమైత్‌ఖాన్‌ విచారణకు హజరవుతారని సిట్‌ తెలిపింది.

English summary
Telugu actor Tarun Yesterday appeared before the Telangana excise department's Special Investigation Team (SIT) for questioning in connection with the drug trade racket, which was busted here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu