నటి హేమ రెమ్యునరేషన్ పెరగలేదు.. 300 కోట్ల ఆస్తి, బీఎండబ్ల్యూ కారు ఎలా వచ్చాయి?

Recommended Video

Actress Hema Shocking Comments On Her Property | Filmibeat Telugu

తల్లి, వదిన, నెగిటివ్ షేడ్స్ లో గయ్యాళి ఆడపడుచుగా ఇలా పలు పాత్రల్లో రాణిస్తూ హేమ దూసుకుపోతోంది. హేమ పేరు చెప్పగానే అతడు, నువ్వు నాకు నచ్చావ్, జులాయి లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. తన నటనతో హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చిన హేమ తాజాగా వినయ విధేయ రామ చిత్రంతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ తల్లినా హేమ పోషించ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

 సినిమాల గురించి ఆలోచించలేదు

సినిమాల గురించి ఆలోచించలేదు

హేమ ఇటీవల గుండుతో కనిపిస్తున్నారు. తన గుండు గురించి హేమ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. చాలా రోజుల నుంచి తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇవ్వాలని అనుకుంటున్నాను. సడెన్ గా కొన్ని రోజుల క్రితం తమ ఫ్యామిలీ మొత్తం తిరుమల వెళ్ళాం అని అక్కడ తలనీలాలు ఇచ్చేసానని హేమ తెలిపింది. ఇంతకు మించి ఇందులో రహస్యం లేదని హేమ తెలిపింది. ఇలా ఉంటె సినిమాలు ఎలా, అవకాశాలు వస్తాయా అని ఆలోచించలేదు. ఇవ్వాలనిపించింది.. ఇచ్చేశా అంతే.

మందు తాగే అలవాటు

మందు తాగే అలవాటు

నాకు మందు తాగే అలవాటు లేదు. కానీ పబ్స్ కి వెళ్లడం అంటే ఇష్టం. డాన్స్ చేయడం, అల్లరి చేయడాన్ని బాగా ఇష్టపడతా. కానీ ఇప్పుడు తానూ అవన్నీ చేయలేదు. నేను పబ్స్ కి వెళితే మీడియాలో హేమ అలా ఇలా అంటూ ఎదో ఒక గాసిప్స్ మొదలిపోతాయి అని హేమ అన్నారు. అందుకే నా పిల్లలని నాతోపాటు బయటకు పెద్దగా తీసుకుని వెళ్ళాను. వాళ్ళు నా పిల్లలు అని తెలియనంత వరకు వాళ్లకు ఫ్రీడమ్ బాగా ఉంటుందని హేమ అన్నారు. నాలా కాకుండా వాళ్లకు ఎలా నచ్చితే అలా ఉండాలి అని హేమ అన్నారు.

చాలా రోజుల తర్వాత

చాలా రోజుల తర్వాత

చాలా రోజుల తర్వాత వినయ విధేయ రామ చిత్రంలో నటించడంపై హేమ స్పందించారు. ఈ చిత్రంలో నా పాత్రకు దర్శకులు, నిర్మాతలు అంతా ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. వినయ విధేయ రామ చిత్రం బిసి సెంటర్స్ లో బాగా ఆడిందని హేమ అన్నారు. సోషల్ మీడియాలో హేమ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దిల్ రాజు గారే స్వయంగా చాలా రోజుల తర్వాత భలే క్యారెక్టర్ పడిందిగా అంటూ మెచ్చుకున్నారు అని హేమ తెలిపింది.

సరైన పాత్రలు

సరైన పాత్రలు

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకుల గురించి మాట్లాడుతూ.. ప్రజెంట్ జెనరేషన్ దర్శకుడు సరైన పాత్రలు సృష్టించడం లేదు. ఉదాహరణకు దూకుడు చిత్రంలో మహేష్ బాబు చుట్టూ అందరూ మగ పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు. అందులో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని పెడితే ఎలా ఉంటుంది అని హేమ అన్నారు. మహిళలకు ఒక డైలాగ్ చెప్పి వెళ్లిపోవడమో, కప్పు అందించి వెళ్లిపోవడమో ఇలాంటి పాత్రలే వస్తున్నాయి అని హేమ తెలిపింది.

రెమ్యునరేషన్ పెంచడం లేదు

రెమ్యునరేషన్ పెంచడం లేదు

నాతో పాటు చాలా మంది లేడీ ఆర్టిస్టులకు ఏళ్ల తరబడి రెమ్యునరేషన్ పెంచడం లేదని హేమ అన్నారు. తాను సినిమాల్లో పాత్రలు తగ్గించుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని అన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన మేల్ ఆర్టిస్టులకు మాత్రం రెమ్యునరేషన్ పెరుగిపోతుంటాయి. కానీ మాకు మాత్రం పెరగవు. అందుకే వినయ విధేయ రామ తరహాలో మంచి పాత్రలు దొరికితే తప్ప తాను సినిమాలు చేయనని, ఏడాదికి రెండు మంచి పాత్రలు చేసినా సంతోషమే అని అన్నారు.

 300 కోట్ల ఆస్తి

300 కోట్ల ఆస్తి

రెమ్యునరేషన్ పెరడం లేదు కానీ.. హేమకు బీఎండబ్ల్యూ కారు, అనేక ప్లాట్లు ఎలా వచ్చాయని యాంకర్ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇవే కాదు బయట జనాలు నాకు 200 నుంచి 300 కోట్లవరకు ఆస్తి ఉందని అనుకుంటున్నారు. ఈ వార్తలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. వాస్తవానికి నావద్ద అంత ఆస్తి లేదు. ఇక కార్లు, ప్లాట్లు అంటారా.. మేము ముందు నుంచి ధనవంతులమే అని హేమ తెలిపింది. నా భర్త కెమెరామెన్. మా తల్లి కుటుంబం బాగా రిచ్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఒంటినిండా నగలతో ఉండేదాన్ని అని హేమ బదులిచ్చింది. కొన్ని చిన్న వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలిపింది.

పూరి జగన్నాథ్‌కు అప్పు ఇచ్చేదాన్ని

పూరి జగన్నాథ్‌కు అప్పు ఇచ్చేదాన్ని

గతంలో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు నాకు స్నేహితులు. నా భర్తకు తెలియకుండా వారందరికీ అప్పుగా డబ్బు ఇచ్చేదాన్ని అని హేమ తెలిపింది. ఇప్పుడు వస్తున్న యువ దర్శకులతో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ పూరిజగన్నాథ్ సహా చాలా మంది తనకు మంచి స్నేహితులు ఉన్నారని హేమ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X