For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆ డైరెక్టర్ దెంగేయ్ అన్నాడు.. హీరో ఏం మాట్లాడలేదు.. వర్మ నోట నీతులా?.. మాధవీలత

  By Rajababu
  |
  Actress Madhavi Latha Responded On Film Industry

  టాలీవుడ్‌ను ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వెంటాడుతున్నది. శ్రీరెడ్డి ఉదంతం సినీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శ్రీరెడ్డి ఘటనపై మాధవీలత స్పందిస్తూ.. తాను కూడా అనేక అవమానాలకు గురయ్యానని చెప్పారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తోపాటు, సోషల్ మీడియాలో మాధవీలత తన అనుభవాలను పంచుకొన్నారు. మాధవీలత మాట్లాడిన విషయాలు మీకోసం..

  హీరోలు ఎందుకు మాట్లాడరు..

  హీరోలు ఎందుకు మాట్లాడరు..


  ఓ హీరోయిన్‌కు డైరెక్టర్ ఎలాంటి గౌరవం ఇస్తే కింది వాళ్లు కూడా అలాంటి రెస్పెక్ట్ ఇస్తారు. ఏ హీరోయిన్‌కైనా అన్యాయం జరిగిందని తెలిస్తే బాలీవుడ్‌లో ప్రతీ హీరో బయటకు వచ్చి స్పందిస్తారు. కానీ మన హీరోలు ఎందుకు మాట్లాడరు అని మాధవీ లత ప్రశ్నించింది. ఒకవేళ మాట్లాడితే మన బండారం బయటపడుతుందని భయపడుతారు. ఎవరైనా నోరు విప్పితే వారిపై నిషేధం విధిస్తారు అని మాధవీ లత చెప్పింది.

  క్యాస్టింగ్ కౌచ్ గురించి వర్మ

  క్యాస్టింగ్ కౌచ్ గురించి వర్మ

  అమ్మాయిలా గురించి, వాళ్ల సేఫ్టీ గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడటం విడ్డూరం అని మాధవీ లత వెల్లడించింది. కొందరి దర్శకుల తీరు చాలా దారుణంగా ఉంటుంది అని ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో మాట్లాడుతూ మాధవీలత ఆవేదన వ్యక్తం చేసింది.

  అతిథి షూటింగ్‌లో

  అతిథి షూటింగ్‌లో

  అతిథి సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను మాధవీ లత వివరించింది. ఈ చిత్రంలో నటించే హీరో అంటే చాలా గౌరవం ఉంది. ఆయన డీసెంట్. ప్రవర్తించే తీరు చాలా బాగుంటుంది. కానీ ఓ రోజు హీరోతో కాంబినేషన్‌లో ఈ సీన్ తీస్తున్నారు. హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవడం ఆలస్యం అయింది. సెట్లోకి రావడం ఐదు నిమిషాలు లేటయింది. అప్పుడు డైరెక్టర్ ఎందుకు లేటయిందని అడిగితే మండిపడ్డారు.

  డైరెక్టర్ దెంగేయ్ అన్నాడు..

  డైరెక్టర్ దెంగేయ్ అన్నాడు..

  నిన్ను ఎవరు హెయిర్ డ్రెస్ ఎవడు చేసుకోమని అన్నాడు. నేను సమాధానం చెప్పితే ఓ దశలో దెంగేయ్ అన్నాడు. అయితే దగ్గరలో ఉన్న మహేష్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది నాకు బాధ కలిగించింది.

  నాని గురించి మాధవీలత

  నాని గురించి మాధవీలత

  స్నేహితుడు సినిమా షూటింగ్‌లో ఓ వ్యక్తి బూతులు మాట్లాడుతుంటే నాని తీవ్రంగా స్పందించాడు. ఆడపిల్ల పక్కనే ఉన్నది. బూతులు మాట్లాడకూడదు అని నాని మందలించాడు. అప్పుడు నాని ప్రవర్తన నాకు చాలా నచ్చింది.

   హీరోలు తప్పులు చేస్తున్నారు..

  హీరోలు తప్పులు చేస్తున్నారు..

  ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు తప్పులు చేస్తున్నారు. వాళ్లు మాట్లాడటానికి భయపడుతున్నారు. అంతేకాకుండా 81 ఏళ్ల చరిత్రలో ఆనాటి హీరోయిన్ల నుంచి ఈ నాటి హీరోయిన్ల వరకు అందరూ బాధపడిన వాళ్లే ఉన్నారు. కానీ ఒక్కరు మాట్లాడరు. కొంత మంది తమ జీవితాలు బలైపోయినప్పటికీ.. ఇప్పుడు తమకు ఏమీ జరుగనట్టే మైకుల ముందు మాట్లాడుతున్నారు అని మాధవీలత ఓ వీడియోలో పేర్కొన్నారు.

  తెలుగు మాట్లాడితే చులకన

  తెలుగు మాట్లాడితే చులకన

  టాలీవుడ్‌లో తెలుగు మాట్లాడితే చులకన చూస్తారు. ఓ మ్యూజిక్ డైరెక్టర్ నాతో దారుణంగా ప్రవర్తించారు. నా మిత్రుడు సదరు మ్యూజిక్ డైరెక్టర్‌కు పరిచయం చేశాడు. చాలా బాగా నటిస్తుంది అని పరిచయం చేశారు. అయితే నన్ను లైట్‌గా తీసుకొని.. పక్కనే ఉన్న బాలీవుడ్ హీరోయిన్‌‌తో హాయ్.. హౌ ఆర్ యూ. ముంబై నుంచి ఎప్పుడొచ్చావు అంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. తెలుగు మాట్లాడితే పనికిరారు అన్నట్టు చూస్తారు అని మాధవీ లత చెప్పింది.

  తెలుగువాళ్లకు రెమ్యునరేషన్

  తెలుగువాళ్లకు రెమ్యునరేషన్

  తెలుగు నటీనటులకు ఎలాంటి సౌకర్యాలు ఉండవు. రెమ్యునరేషన్ కూడా తక్కువ ఇస్తారు. ముంబై నుంచి వచ్చే వాళ్లకు కార్‌వాన్ ఇస్తారు. తెలుగు వాళ్లను చెట్ల కింద కూర్చోపెడుతారు. తెలుగు మాట్లాడటం అవమానంగా భావిస్తారు అని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు.

  నలిగిపోయి.. చెప్పుకోలేని కథలు

  నలిగిపోయి.. చెప్పుకోలేని కథలు

  కామం కాటికి కాలు చాపిన ముసలి వాడి కళ్ళలో కూడా జ్వలిస్తూనే ఉంది. అయినా బదిలీ ఔదామంటే అది లేనిదెక్కడా? ఒక్క సినీ రంగమేనా? బతకాలంటే బరితెగించాలి లేదా బాధను దిగమింగాలి. చీకటిలో నలిగి పోయిన చెప్పకోలేని కథలు , విప్ప లేని ముడులు ఎన్నో , కన్నీళ్ళతో కష్టం తీరిపోతే ఇన్నాళ్లుగా ఈ భాధలెందుకు? ఏరి కోరి వచ్చినందుకు పక్కలోకి చేరుకోవడం తప్పడం లేదు అయిన మాకు ఈ సినిమా పిచ్చి మాకు ఇష్టం. మిమ్మల్ని నవ్వించాడానికి మేము నవ్వుల పాలు కాక తప్పడం లేదు. అయినా మాకు సినిమా ఇష్టం. మేము చచ్చే వరకు మిమ్మల్ని ఆనందపెట్టడానికి మేకప్‌తో వస్తూనే ఉంటాం అని ఫేస్‌బుక్‌లో మాధవీలత పోస్టు పెట్టారు.

  త్వరలో భయంకరమైన నిజాలు

  మీరు మాట్లాడే పిచ్చి మాటలు ఎన్నాళ్లు మాట్టాడుతారో చూడండి. త్వరలో భయంకరమైనా నిజాలు తెలుస్తాయి. వాగుతున్న మీ నోర్లు షాక్‌తో అలానే తెరుచుకుంటాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అడిగే ప్రశ్నలకు నేను ఇంకా మీకు సమాధానం చెప్పను అని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

  English summary
  When Sri Reddy issue become hot in Industry. Actress Madhavi Latha responded on Cating couch. She reveals about her experiences in the Tollywood. Madhavi Latha faults Tollywood heroes.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more