Pragathi: చీర పైకెత్తి ఓ పట్టుపట్టిన ప్రగతి.. 47 ఏళ్ల వయసులోనూ జోష్ మాములుగా లేదుగా!
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో ఆమె మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని మీడియా సంస్థలు ప్రగతి రెండో పెళ్లంటూ వార్తలు రాసుకువచ్చాయి. ఇక వాటిపై ప్రగతి తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక కొన్ని మీడియా సంస్థలకు అయితే ఏకంగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయం పక్కన పెడితే.. ఈ వయసులో ప్రగతి చేసిన ఓ పనికి మళ్లీ ఆమె ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆమె తన ఇన్ స్టా వేదికగా ఓ వీడియో పంచుకుంది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
సహాయ నటిగా ప్రగతికి మంచి గుర్తింపు ఉంది. సినిమాల్లో అక్కగా, తల్లి, అత్త పాత్రలతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. సినిమాల్లో పద్ధతిగా కనిపించే ప్రగతి.. బయట మాత్రం కాస్త హాట్ హాట్ గానే ఉంటుంది. ఇక 47ఏళ్లు వచ్చినా.. ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. అంతే యాక్టివ్ గా అందాలను ఆరబోస్తుంది. ఇక ఇటీవల ఆమె ఓ విషయం లో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు నెట్టింట వైరల్ అయింది. ఇక స్టార్ ప్రోడ్యూసర్ తో త్వరలో పెళ్లంటూ చాలా మీడియా సంస్థలు కథనాలు రాశాయి. దీంతో ఆమె.. ఈ కథనాలపై స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు అంటూ ఫైర్ అయింది. ఫ్రూవ్స్ ఉంటే ఏమైనా రాసుకోండి అంతే తప్ప ఊహించి రాసుకోకండి అంటూ ఓ షాకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇక పలు మీడియా సంస్థలకు నోటిసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఆ విషయం పక్కన పెడితే మరో విషయంలో ఇప్పుడు ప్రగతి ట్రెండింగ్ లోకి వచ్చింది. అదేంటో కాదు.. తను ఎక్కువగా జిమ్ వీడియోలతో ఫేమన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఓ జిమ్ వీడియో వదిలి నెట్టింట మంట పుట్టించింది. 48 ఏళ్ళు వచ్చినా ఇంకా ఫుల్ ఆరోగ్యంగా, బాడీని కూడా ఫిట్ గా మెయింటైన్ చేస్తున్న ప్రగతి... సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇక తాజాగా ప్రగతి జిమ్ లో కష్టపడుతున్న వీడియోల్ని పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఏజ్ లో కూడా జిమ్ లో అంత కష్టపడుతున్నారంటే గ్రేట్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రగతిని అభినందిస్తూ.. ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక రెగ్యులర్ గా జిమ్ డ్రెస్ లో వీడియోలు పోస్ట్ చేస్తుండగా తాజాగా చీరలో జిమ్ వీడియో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది ప్రగతి.
Balakrishna: ఫ్యాన్స్‌కు పండగే.. పక్క పక్కన ఇళ్లలోనే చిరంజీవి, బాలయ్య.. అసలు రీజన్ ఇదే!
ప్రగతి చీర కట్టుకొని జిమ్ లో 90 కేజీల బరువు ఈజీగా మోసేసింది. దీంతో ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. 90 కేజీల బరువు మోయడం, అది కూడా చీరలో ఇలా మోయడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రగతి జిమ్ వీడియో నెట్టంట హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











