»   » ఆమేనా ఈమే..!? నమ్మలేరు, అభిమానులు ఈ ఫొటో చూడక పోవటమే మంచిది

ఆమేనా ఈమే..!? నమ్మలేరు, అభిమానులు ఈ ఫొటో చూడక పోవటమే మంచిది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడలో ʹఅప్పుʹ, తెలుగులో ʹఇడియట్ʹ సినిమాలు హిట్ అవ్వడంతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది రక్షిత. తర్వాత నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. అయితే ఫిజిక్ కాపాడుకోకపోవడం వల్ల ఆ క్రేజ్ ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది రక్షిత. అదే టైంలో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి 2007లో అతడినే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది రక్షిత. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులు రక్షితను ఎప్పుడూ చూడలేదు, ఆమెను గురించిన వార్తలు కూడా బయటకు రాలేదు.

Actress Rakshita Latest Look

టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన రక్షిత చాలా వేగంగా షేపవుట్ అయిపోవడం వల్ల తెలుగు సినిమాలకు దూరమైపోయింది. టాలీవుడ్ సినిమాలకు గుడ్ బై చెప్పే టైముకే అదోలా తయారైన రక్షిత.. ఇప్పుడున్న లుక్ లో చూస్తే ఒకప్పుడు ఆమె గ్లామర్ కు దాసోహం అన్న అభిమానులు కంగు తినడం ఖాయం.ఇప్పుడు గుర్తు పట్టలేకుండా తయారైంది. స్థూలకాయంతో బాధ పడుతూ సినిమాలకి పూర్తిగా దూరమైన రక్షిత ఇప్పటికీ అనారోగ్యాన్ని జయించలేకపోయింది. ఆమెకు సూర్య అనే కొడుకు ఉన్నాడు. ప్రెగ్నెన్సీ తర్వాత బాడీలో బాగా మార్పులొచ్చేసి నడి వయసు మహిళలా కనిపించే రూపంతో అసలు ఆనాటి రక్షిత ఈమేనా అన్నట్టుగా కనిపిస్తోంది. రక్షిత లేటెస్ట్‌ ఫోటో ఇది.

English summary
Rakshita looked plump and out of shape. This unexpected transformation might be shocking for her Telugu Fans as she hasn't made public appearances in Telugu States in the past few years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu