తిరుమల శ్రీవారికి శ్రీరెడ్డి కోర్కెల చిట్టా.. శత్రువుల నుంచి ఇబ్బందులు, అది మాత్రం టాప్ సీక్రెట్!

Recommended Video

Sri Reddy Visits Tirumala & Reveals Her Future Plan

సంచలన నటి శ్రీరెడ్డి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. గత కొన్ని నెలలుగా శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డిపై ఇటీవల మీడియా ఫోకస్ తగ్గించిన తరువాత సోషల్ మీడియా వేదికగానే ఆమె తన సంచలన వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తోంది. పవన్ కళ్యాణ్ పై, ఆయన తల్లిపై శ్రీరెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగిన తరువాత ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తరువాత శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం మరుగున పడిపోయింది. త్వరలో ఢిల్లీ స్థాయిలో తన పోరాటాన్ని ప్రారంభిస్తానని శ్రీరెడ్డి చెబుతోంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కూడా శ్రీరెడ్డి ఇదే వ్యాఖ్యలు చేసింది.

పోరాటానికి ఇబ్బందులు

పోరాటానికి ఇబ్బందులు

శ్రీవారిని నడకదారిని వచ్చి దర్శించుకున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది. తన పోరాటానికి ఇటీవల అవాంతరాలు ఏర్పడ్డాయని శ్రీరెడ్డి తెలిపింది. శత్రువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన పోరాటం ముందుకు సాగాలని కోరుకున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది.

ఢిల్లీ స్థాయిలో

ఢిల్లీ స్థాయిలో

తన కాస్టింగ్ కౌచ్ పోరాటం ఢిల్లీస్థాయిలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నానని శ్రీరెడ్డి తెలిపింది. ఈ పోరాటం విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో కొన్ని రాజకీయ పరమైన కోరికలు కూడా కోరుకున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది.

ఆడపిల్లలనే చిన్న చూపు

ఆడపిల్లలనే చిన్న చూపు

తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యలని సరిగా పట్టించుకోవడంలేదని, ఆడపిల్లలనే చిన్న చూపు అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. అయినా కూడా తెలంగాణలో 2019 లో కూడా టిఆర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకున్నానని తెలిపింది.

టాప్ సీక్రెట్

టాప్ సీక్రెట్

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నన్నాని, అది మాత్రం సీక్రెట్ అని శ్రీరెడ్డి తెలిపింది.

అన్ని చిత్ర పరిశ్రమల్లో

అన్ని చిత్ర పరిశ్రమల్లో

కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఆడవాళ్లకు ఉన్న సమస్యలన్నీ తొలిగిపోవాలని శ్రీరెడ్డి తెలిపింది. ఆ విధంగానే తన కోరికలు కోరుకున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X