Chor Bazaar Twitter Review: ఆకాశ్ సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా కాలంగా స్టార్ల కుటుంబాల నుంచి వారసులు వస్తూనే ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవగా.. మిగిలిన వాళ్లు మాత్రం ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ ఒకడు. చాలా రోజుల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. వరుసగా సినిమాలు చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 'చోర్ బజార్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో ఆశలు, అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది? ట్విట్టర్‌లో ఈ సినిమాపై ఎలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి? అనేవి చూద్దాం పదండి!

‘చోర్ బజార్’తో వచ్చేసిన ఆకాశ్

‘చోర్ బజార్’తో వచ్చేసిన ఆకాశ్


స్టార్ కిడ్ ఆకాశ్ పూరీ హీరోగా జార్జ్ రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన సినిమానే 'చోర్ బజార్'. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీఎస్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు సహా ఎంతో మంది నటులు కీలక పాత్రల్లో నటించారు.

అంచనాలు తగ్గట్లుగానే బిజినెస్

అంచనాలు తగ్గట్లుగానే బిజినెస్

పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ నటించిన 'చోర్ బజార్' సినిమా విభిన్నమైన కథతో రూపొందింది. దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ జరిగిందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

చోర్ బజార్ సినిమాకు టాక్ ఇలా

చోర్ బజార్ సినిమాకు టాక్ ఇలా

ఆకాశ్ పూరీ - గెహనా జంటగా నటించిన 'చోర్ బజార్' మూవీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది బాగుందని కొందరు అంటుండగా.. ఏవరేజ్ అని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా

'చోర్ బజార్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేందుకు కొంత టైమ్ తీసుకున్నారట. అయితే, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయేలా ఉందట. అయితే, సెకెండాఫ్ మాత్రం కొంత ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైన్‌గా ఉంటుందని తెలిసింది. కానీ, క్లైమాక్స్ మాత్రం కొత్తగా లేకపోవడంతో తేలిపోయినట్లు ఉంటుందట.

సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా

సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఇలా

ఆకాశ్ పూరీ 'చోర్ బజార్' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఆకాశ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్, ట్విస్టులు, ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అలాగే, దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తగా లేకపోవడంతో పాటు నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్, పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా సినిమా ఎలా ఉందంటే!

మొత్తంగా సినిమా ఎలా ఉందంటే!

ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఆకాశ్ పూరీ నటించిన 'చోర్ బజార్' మూవీ వజ్రం దొంగతనం చుట్టూ సాగే క్రైమ్ థ్రిల్లర్ అని అంటున్నారు. అయితే, ఫస్టాఫ్ ఉన్నంత బలంగా సెకెండాఫ్ లేకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు. కానీ, ఆకాశ్ మాత్రం తన మ్యానరిజం, డైలాగ్‌లతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడట. మొత్తం ఇది పర్వాలేదనిపిస్తుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X