మా నాన్నను నేనే లాంచ్ చేస్తున్నాను: మెహబూబాపై ఆకాష్ పూరి ఎమోషనల్ స్పీచ్

By Bojja Kumar

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. మే 11న సమ్మర్‌ స్పెషల్‌గా 'మెహబూబా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్‌రాజు వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆకాష్ ఎమోషనల్‌గా స్పందించారు.

దిల్ రాజు 10 రెట్ల ఉత్సాహాన్ని ఇచ్చారు

దిల్ రాజు 10 రెట్ల ఉత్సాహాన్ని ఇచ్చారు

డాడీ ఈ సినిమా కథ చెప్పగానే చాలా కాన్ఫిడెంట్ అనిపించింది. ఏ మాత్రం భయం అనిపించలేదు. సినిమా మేము ఇంత కాన్ఫిడన్స్‌గా చేస్తే దిల్ రాజుగారు వచ్చి ఈ సినిమాను తీసుకుని మా కాన్ఫిడెన్స్ 10 రెట్లు ఎక్కువ చేశారు. ఇందుకు సంబంధించి ప్రెస్ నోట్ రిలీజైన రోజే నాకు అందరూ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పేశారు. దిల్ రాజుగారు తీసుకున్నారు కంగ్రాట్స్, నువ్వు చాలా లక్కీ అంటూ అంతా మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించారు. థాంక్స్ సార్ మా సినిమా తీసుకున్నందుకు... మీరు సినిమా రిలీజ్ చేస్తున్నారంటే బయట అంతగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.... అని ఆకాష్ తెలిపారు.

సినిమా ఒకలా అనుకుంటే తను వచ్చి ఇంకో లెవల్ కి తీసుకెళ్లాడు

సినిమా ఒకలా అనుకుంటే తను వచ్చి ఇంకో లెవల్ కి తీసుకెళ్లాడు

ఏ సినిమా కైనా టీమ్ అనేది చాలా ముఖ్యం. ముందు మా కెమెరామెన్ విష్ణు గారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము సినిమా ఒకలా అనుకుంటే తను వచ్చి ఇంకో లెవల్ కి తీసుకెళ్లాడు. టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా మీకు ఈ విషయం అర్థమవుతుంది. తనకు చికెన్ ఫాక్స్ వచ్చినా లొకేషన్‌కు వచ్చి చలిలో వణుకుతూ మాతో పరుగెత్తారు. ఇండియాలో ఆయన టాప్ మోస్ట్ కెమెరామెన్ అవుతాడు... అని ఆకాష్ తెలిపారు. మా ఫైట్ మాస్టర్ సతీష్ గారు నాకు ప్రతి స్టంట్ ఎంతో నమ్మకంగా చేయించారు. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నాను. మా ఆర్ట్ డైరెక్టర్ జానీగారు ఇంత బాగా చేస్తారని ఊహించలేదు అన్నారు.

నేనే మా నాన్నను లాంచ్ చేస్తున్నాను

నేనే మా నాన్నను లాంచ్ చేస్తున్నాను

నేను మా నాన్న గురించి ఒకటే చెబుతున్నాను. థాంక్స్ అనేది చాలా చిన్నది. నన్ను నమ్మి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టారు. ఆయన ఇపుడు చాలా అప్డేట్ అయ్యారు. సినిమా చాలా బాగా వచ్చింది, పగిలిపోవడం ఖాయం. మొన్న నాన్న ఒక మాట అన్నారు ఇది ఆకాష్ లాంచింగ్ సినిమా కాదు, నా లాంచింగ్ సినిమా అని. అవును......నేను మా నాన్నను లాంచ్ చేస్తున్నాను, మా నాన్న నన్ను లాంచ్ చేయడం లేదు. ఆయన గురించి ఇంత కంటే ఎక్కువ మాట్లాడకూడదు, ప్రీ రిలీజ్ ఈవెంటులో మాట్లాడతాను అని ఆకాష్ తెలిపారు.

1971లో జరిగిన ఇండో – పాక్ యుద్ధం నేపథ్యంలో

1971లో జరిగిన ఇండో – పాక్ యుద్ధం నేపథ్యంలో

ద‌ర్శ‌కుడు పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ తో ‘మెహబూబా' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 1971లో జరిగిన ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ఓ ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఆకాశ్ జోడీగా నేహా శెట్టి నటిస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంట‌న్న‌ది.. ఈ మూవీని మే నెలలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీలోని ఓ ప్రియా..నా ప్రియా సాంగ్ ను సోమ‌వారం నాడు విడుద‌ల చేయ‌నున్నారు.. ఈ మూవీకి సందీప్ చౌత‌లా సంగీతం స‌మ‌కూర్చాడు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X