రాంగ్ పర్సన్ వల్ల పూరి ఇబ్బందులు.. వాడి తల పగలగొట్టాలి అనుకున్నా: ఆకాష్ పూరి పవర్ఫుల్ స్పీచ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ అందుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో మరింత పవర్ ఫుల్ గా సిద్ధమవుతున్నాడు. ఇక పూరి తనయుడు ఆకాష్ పూరి కూడా ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రొమాంటిక్ సినిమాతో ఈ నెల 29న రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించగా అందులో ఆకాష్ మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

విజయ్ దేవరకొండ అద్భుతం..

విజయ్ దేవరకొండ అద్భుతం..

ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ముందుగా ఈ వేడుకకు విచ్చేసిన విజయ్ దేవరకొండ చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన నటిస్తున్న లైగర్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారు. ఆయన పనితనానికి నేను ఎప్పుడో అభిమానిని అయ్యాను. సినిమా లో కొన్ని విజువల్స్ కూడా నేను చూశాను. అందులో నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. మా నాన్నగారు ఎంత రాసిన కూడా మీరు దాన్ని మమేకం చేసుకోవడం అద్భుతంగా అనిపించింది. సినిమా విడుదల తర్వాత మామూలుగా ఉండదు అని ఆకాష్ వివరణ ఇచ్చాడు.

ఈ సినిమాకు ఆమె అవసరం

ఈ సినిమాకు ఆమె అవసరం

రొమాంటిక్ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా కాలం ఎదురు చూస్తున్నాను. డైరెక్టర్ అనిల్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఈ రెండు మూడేళ్లు కూడా ఈ సినిమాను నమ్ముకొని ప్రాణం పెట్టి పని చేశాము. నాకు ఆయన మద్దతుగా నిలిచారు. రమ్య కృష్ణ గారు సినిమాలో ఎంతో స్పెషల్ గా కనిపించారు. ఈ సినిమా నాకు దర్శకుడికి హీరోయిన్ కి అందరికీ అవసరం. కానీ ఈ సినిమాకు మాత్రం రమ్య కృష్ణ గారు అవసరం. ఎందుకంటే ఆమె అంతా మంచి పాత్ర చేశారు.. అని ఆకాష్ మాట్లాడాడు.

రాంగ్ పర్సన్ ని నమ్మడం వలన..

రాంగ్ పర్సన్ ని నమ్మడం వలన..

ఆకాష్ మాట్లాడుతూ.. ముఖ్యంగా నేను మా నాన్న గురించి మాట్లాడాలి. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నర్సీపట్నం నుంచి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చారు. చాలా కష్టపడి దర్శకుడిగా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఒక పెద్ద బస్సును కొనుక్కున్నారు. మా అమ్మను మా చెల్లిని ఎక్కించుకుని ఒక లాంగ్ జర్నీ చేశారు. అయితే ఒక రాంగ్ పర్సన్ ని నమ్మడం వలన మంచిగా వెళుతున్న బస్సు సడన్ గా ఆగిపోయింది. అప్పుడు మేము అందరం బస్సు లోనే ఉన్నాము అప్పుడు మా నాన్న ఒక్కడే కిందకు దిగి ఆ బస్సును తోస్తూనే ఉన్నాడు.

తల పగలగొట్టాలని అనిపించేది..

తల పగలగొట్టాలని అనిపించేది..

మా నాన్నను ఎవరైనా ఏదైనా అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఏదైనా కామెంట్ చేశారు అనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి తల పగలగొట్టాలని అనిపించేది. పూరి టైమ్ అయిపోయింది.. రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అని చాలామంది అన్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఆయన ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు చెబుతున్నా.. నీ కెరీర్ అయిపోయింది నీ వల్ల ఏమీ కాదు అన్న వారికి నేను ఇప్పుడు చెబుతున్నాను. దీనబ్బ కొట్టాడు రా మావొడు.. అని ఆకాష్ పూరి పవర్ ఫుల్ గా తన తండ్రి గురించి మాట్లాడాడు.

సక్సెస్ అవ్వకపోతే..

సక్సెస్ అవ్వకపోతే..

మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవారు. జీవితంలో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ముఖ్యం కాదు. మనకిష్టమైన పనిలో మా ఉండడమే సక్సెస్ అని చెప్పారు. కానీ అది నాకు ఎంత మాత్రం సెట్ అవ్వదు. మీ నాన్నగారు నువ్వు ఫీల్ అయిన పర్వాలేదు అని సినిమాల్లోకి పంపించారు. అయితే నేను మాత్రం పూరి జగన్నాథ్ కొడుకు గా వచ్చాను.

బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినోడు సక్సెస్ కాకపోతే అసలు మనిషి లాగా కూడా చూడరు. లైఫ్లో నేను సక్సెస్ అవ్వాలి. తప్పకుండా నేను సక్సెస్ అవుతారు నాన్న. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం నాన్న.. తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు గర్వపడేలా కష్టపడతాను.. అని ఆకాష్ చెప్పాడు.

Recommended Video

Romantic Trailer | Prabhas Praises Akash Puri And Ketika Sharma
నీ కంటే 1% ఎక్కువ ఇచ్చే చస్తాను..

నీ కంటే 1% ఎక్కువ ఇచ్చే చస్తాను..

మీరు ప్రతి సినిమాని మొదటి సినిమా అనేలా కష్టపడు అని చెప్పారు. కానీ నేను మాత్రం ఇదే నా లాస్ట్ సినిమా అనేలా కష్టపడతాను నాన్న.. నువ్వు దేనికి పనికి రాను అన్న వారికి ఒకటే చెబుతున్నాను. ఇట్స్ నాట్ ఓవర్.. నా జీవితంలో ఎప్పుడు బ్రేక్ వస్తుందో నాకు తెలియదు. నేను కొట్టాల.. నువ్వు ఏదో ఒకరోజు కాలర్ ఎగరేయాలా.. దానికోసం నేను కష్టపడతాను.

నువ్వు ఈ సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో ఇచ్చావు. ఇదే సినిమా ఇండస్ట్రీ నాకు స్కూల్ ఫీజు కట్టింది. నాకు అన్నం పెట్టింది. నువ్వు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇచ్చావో నీకంటే నేను ఒక శాతం ఎక్కువ ఇచ్చి చస్తాను నాన్న. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను సినిమా ఇండస్ట్రీ లోనే ఉంటాను. ఇది తప్ప నాకు ఏది రాదు.. అంటూ ఎమోషనల్ గా మాట్లాడిన ఆకాష్ యాంకర్ సుమను తల్లిగా భావించి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X