టాయిలెట్ ప్రేమ కథ పేరుతో.... స్టార్ హీరో సాహసం!
ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టతింది పేరైన బాలీవుడ్లో మరో ఆసక్తికర కథాంశంతో ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా’ పేరుతో ఓ సినిమా రాబోతోంది.
హైదరాబాద్: ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టతింది పేరైన బాలీవుడ్లో మరో ఆసక్తికర కథాంశంతో 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' పేరుతో ఓ సినిమా రాబోతోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈచిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అక్షయ్ కుమార్ సినిమాకు సంబంధించిన స్టిల్ ఒకటి అభిమానులతో షేర్ చేసుకున్నారు. అక్షయ్ కుమార్ సరసన భూమి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఇద్దరికీ కొత్తగా పెళ్లయిన సందర్బంలోనిది ఈ స్టిల్. పది రూపాయల మాల ధరించిన అక్షయ్ కుమార్ డిఫరెంట్ లుక్ తో అభిమానులకు కనువిందు చేసారు.
నరేంద్ర మోడీ ప్రాజెక్టుపై సెటైర్?
ఈ సినిమా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్' ప్రాజెక్ట్ మీద సెటైరిక్ గా ఉంటుందని టాక్. ఈ సినిమాలో సనా ఖాన్ అక్షయ్ కుమార్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది.

సనా ఖాన్
సినిమాలో సనా ఖాన్ చేసే గెస్ట్ రోల్ ఎంతో కీలకంగా ఉంటుందని, ఇందులో ఆమె పూర్తి దేశీ అవతారంలో కనిపిస్తుందని సమాచారం. ఇటీవలే సనా ఖాన్ తన షూటింగ్ పార్టును కంప్లీట్ చేసిందిన చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

అక్షయ్ కుమార్ భార్య షాకింగ్ ట్వీట్: ఈ చంపుకోవడం ఏంటో..?

ఖరీదైన బోటులో ఫామిలీతో ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్ (ఫోటోస్)

భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా
భూలోక స్వర్గం ఇదే : అక్షయ్ కుమార్ లావిష్ బంగ్లా ఇన్ సైడ్ (ఫొటోల కోసం క్లిక్ చేయండి)


Click it and Unblock the Notifications











