పవన్ కళ్యాణ్‌పై కుట్రకు వ్యతిరేకంగా ఏకం అవుతున్న మెగా ఫ్యామిలీ.. రీ ట్వీట్ చేసిన అల్లు అర్జున్!

కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం అంటూ గత నెలరోజులు ప్రముఖ మీడియా ఛానల్స్ అదేపనిగా డిబేట్లని ప్రసారం చేసాయి. చివరకు ఈ వ్యవహారంలోకి పవన్ కళ్యాణ్ ని లాగాలని ప్రయత్నాలు జరగడం, అతడి తల్లిపై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారిగా తాను శ్రీరెడ్డి చేత ఆ మాటలు అనిపించానని చెప్పడంతో దీని వెనుక రాజకీయ కోణం దాగుందని అనుమానాలు మొదలయ్యాయి.

శ్రీరెడ్డి వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం, ఆ తరువాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన విషయాలు వెల్లడిస్తూ వర్మని కడిగిపారేశారు. ఈ అర్థరాత్రి నుంచి పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. తనపై, తన కుటుంబం పై కుట్ర జరుగుతోందని పలువురు మీడియా అధినేతల పేర్లు బట్టబయలు చేసారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ట్విట్స్ సంచలనం రేపాయి.

 Allu Arjun retweets Pawan Kalyan tweets

పవన్ కళ్యాణ్ ట్విట్స్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీ ట్విట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి కానీ, రాజకీయ కలపాలి గురించి కానీ బన్నీ ఎప్పుడూ స్పందించలేదు. పవన్ కళ్యాణ్ న్యాయ పరమైన పోరాటం చేయడానికి ఫిల్మ్ ఛాంబర్ లో లాయర్లతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మెగా బ్రదర్ నాగబాబు హాజరయ్యారు. అల్లు అర్జున్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. తెరవెనుక జరుగుతున్న రాజకీయ కుట్రని చేధించేందుకు మెగా ఫ్యామిలీ మళ్ళీ ఏకం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X