టాప్ లేచిపోద్ది (‘ఇద్దరమ్మాయిలతో' ప్రివ్యూ)
హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో ఏ సినిమాకీ రానంత హైప్ తో, హై ఎక్సపెక్టేషన్స్ తో వస్తున్న భారీ చిత్రం'ఇద్దరమ్మాయిలతో'. అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదల అవుతోంది. దేశముదురు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావటం, ట్రైలర్స్ కు టీజర్స్ కు మంచి క్రేజ్ రావటం ఈ అంచనాలును రెట్టింపు చేసింది.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...ఇదొ కలర్ ఫుల్ లవ్ స్టోరీ, బన్నీ ఇరక్కొట్టి, కుమ్మి అవతల పడేసాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేసాం. ట్రైలర్లకు, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. శుక్రవారం వచ్చే రిజల్ట్ కోసమే అంతా వెయిట్ చేస్తున్నామని తెలిపారు.
హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ.... దేవిశ్రీ నా సినిమాకు పని చేసిన ప్రతి సారి గతంలో కంటే బెస్ట్ మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు. మరోసారి మంచి ఆడియో ఇచ్చినందుకు థాంక్స్. పూరి జగన్నాథ్ తో రెండో సారి చేస్తున్నాను. ఈ సినిమా ఆయన నాపై ప్రేమతో చేసాడు. ఒక సినిమాకు ఎంతో మంది కలిసి పని చేస్తుంటారు. అందరి ఈగోలు మేనేజ్ చేస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లడం ఎలాగో నిర్మాత బండ్ల గణేష్‌కు బాగా తెలుసు. ఆయన చెబుతున్నట్లు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ సెన్సార్ సభ్యులు సినిమా చూశాక తమను ప్రశంసించారని, మరో బ్లాక్‌బస్టర్‌గా విజయవంతమవుతుందన్న నమ్మకం కుదిరిందని తెలిపారు. బన్నీ కెరీర్‌లో నెం.1 హిట్‌గా, పూరికి మరో పోకిరిగా, తమ సంస్థకు బ్లాక్‌బస్టర్ విజయం అందించడానికి 'ఇద్దరమ్మాయిలతో' వస్తోందని, పూరి టేకింగ్, బన్నీ డాన్సులు, ఫైట్స్ హైలెట్‌గా ఉండే ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ లభించిందని తెలిపారు. యూత్‌కు అమలాపాల్, కేథరిన్‌లు నచ్చుతారని, బ్రహ్మానందం పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు.
బ్యానర్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
నటీనటులు:అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్ ,బ్రహ్మానందం, నాజర్, అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్,
కెమెరా: అమూల్ రాథోడ్,
ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్,
సమర్పణ: శివబాబు బండ్ల,
నిర్మాత: బండ్ల గణేష్,
కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











