మా ఆయనకు తెలియకుండా పూరి జగన్నాథ్‌కు డబ్బులిచ్చాను.. కన్యాదానం నేనే చేశా: నటి హేమ

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దాదాపు అందరితోనూ స్నేహంగానే ఉంటారు. ఆయనను కలిస్తే చాలా పాజిటివ్ గా ఉంటుందని, బ్రతికతే అతనిలా బ్రతకాలని ఎంతో మంది దర్శకులు ఇంటర్వ్యూలలో డైరెక్ట్ గా చెప్పేసేవారు. ఇక పెద్దా చిన్నా తేడా లేకుండా అందరితోను కలివిడిగా ఉండే పూరి గురించి ఒక ఇంటర్వ్యూలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు.

ప్రతి డైలాగ్ ఎన్నో ఆలోచనలు

ప్రతి డైలాగ్ ఎన్నో ఆలోచనలు

పూరి జగన్నాధ్ ఎన్ని కమర్షియల్ సినిమాలు తీసినా కూడా ఆయన ప్రతి డైలాగ్ ఎన్నో ఆలోచనలను కలిగిస్తాయి. ముఖ్యంగా జీవిత సత్యాలు చెప్పడంలో పూరి తరువాతే ఎవరైనా. ఏమి లేకపోయినా సోలో వారియర్ గా బ్రతకాలని అతని పాత్రలతో చెప్పకనే చెబుతుంటారు. పూరి జగన్నాథ్ తో మాట్లాడాలి అని అగ్ర దర్శకులు కూడా స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటారు.

పూరి జగన్నాథ్ కూడా ఉండాల్సిందే

పూరి జగన్నాథ్ కూడా ఉండాల్సిందే


ఎప్పుడైనా దర్శకుల మీటింగ్స్ జరిగితే అందులో తప్పకుండా పూరి జగన్నాథ్ కూడా ఉండాల్సిందే. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అయినప్పటికీ అతనికి ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పూరి పోడ్ క్యాస్ట్ ద్వారా ఎన్నో మంచి విషయాలను చెబుతున్నాడు. దాదాపు స్టార్ హీరోల రేంజ్ లో పూరి తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సెట్ చేసుకున్నాడు.

పూరిపై హేమ కామెంట్స్

పూరిపై హేమ కామెంట్స్


ఒక ఇంటర్వ్యూలో నటి హేమ కూడా పూరి జగన్నాధ్ మంచి తనం గురించి చెప్పింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలైనప్పుడు పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతూ వచ్చాడు. ఆ టైమ్ లో ఏవైనా సింగిల్ ఎపిసోడ్స్ కు డైరెక్షన్ చేయాలని అన్నప్పుడు పూరి జగన్నాథ్ ను ఎక్కువ మంది సెలక్ట్ చేసుకునేవారని హేమ తెలిపారు.

ఒక అన్నయ్యలా ఉండేవాడు

ఒక అన్నయ్యలా ఉండేవాడు

హేమ మాట్లాడుతూ.. ఇక ఆ టైమ్ లో నేను , వినోద్ బాలా, రఘు కుంచె పూరి జగన్నాథ్ తో కలిసి వర్క్ చేశాం. మెల్లగా షూటింగ్స్ లో క్లోజ్ అయ్యాం. మా ఇంట్లో వాళ్ళకు కూడా పూరి జగన్నాథ్ క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. ఒక అన్నయ్యలా ఉండేవాడు. మా అమ్మ కూడా పూరి జగన్నాథ్ వస్తే షూటింగ్స్ కు పంపెది. అంతలా ఒక బ్రదర్ రిలేషన్ ఏర్పడింది.

డబ్బులు ఇచ్చేదాన్ని..

డబ్బులు ఇచ్చేదాన్ని..


అయితే కొన్ని సమయాల్లో పూరి జగన్నాథ్ కు డబ్బు సహాయం అవసరం అయితే నేనే ఇచ్చే దాన్ని. మరి ఎక్కువ కాదు. మా ఆయన నాకు ఇచ్చినప్పుడు, తెలియకుండా పూరి అన్నయ్యకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చే దాన్ని. మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేవాడు కూడా. ఎంతో కలిసి మెలిసి ఆప్యాయంగా ఉండేవాళ్ళం.

Recommended Video

Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Filmibeat Telugu
కన్యాదానం చేశాము.

కన్యాదానం చేశాము.


ఇక తను లవ్ చేసిన అమ్మాయిని కూడా మాకు పరిచయం చేసి పెళ్లికి సిద్ధమైనప్పుడు మేమే దగ్గరుండి పెళ్లి చేశాము. అప్పుడు పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే నేను మా ఆయన కలిసి కాళ్లు కడిగి కన్యాదానం చేశాము. పూరి జగన్నాథ్ చాలా మంచి వ్యక్తి కాబట్టి ఇన్ని రోజులకు కూడా తనతో అన్నయ్య అనే అనుబంధం నాకు ఉంది. నాతోనే కాకుండా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో బావుంటాడు అని హేమ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X