»   » తెలంగాణలో బాహుబలి-2 కోసం ప్రత్యేకంగా జీవో, అలా చేస్తే కఠిన చర్యలే!

తెలంగాణలో బాహుబలి-2 కోసం ప్రత్యేకంగా జీవో, అలా చేస్తే కఠిన చర్యలే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ నెల 28న విడుదల కాబోతున్న 'బాహుబలి-2' సినిమా అదనపు షోలు వేసుకునేందుకు తెలుంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్మాతలకు హామీ ఇచ్చారు, ఇందుకు సంబంధించిన జీవో జారీ చేయనున్నట్లు తెలిపారు.

బాహుబలి చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సచిలవాలయంలో కలిసారు. తెలంగాణలో ఐదు ప్రదర్శనలకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నిర్మాత నిర్మాతలు కోరిన విధంగా ఐదు ప్రదర్శనలకు అనుమతిస్తామన్నారు.


వందేళ్ల సినీ చరిత్రలో ఇది ప్రత్చేకం

వందేళ్ల సినీ చరిత్రలో ఇది ప్రత్చేకం

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి చిత్రాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వందేళ్ల సినీ చరిత్రలో ఒక సినిమా కోసం ఇంతగా ఎవ్వరు ఎదురు చూడలేదని మంత్రి తలసాని అన్నారు.


అలా చేస్తే కఠిన చర్యలు

అలా చేస్తే కఠిన చర్యలు

ఈ సందర్భంగా తలసాన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టికెట్ విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో జరిగేలా చూస్తామని తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్

తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్

బాహుబలి చిత్రానికి అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తామన్న రాష్ర్ట ప్రభుత్వానికి చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దల కోసం బాహుబలి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.


ఏపీలో రోజకు 6 షోలకు అనుమతి

ఏపీలో రోజకు 6 షోలకు అనుమతి

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Makers of 'Baahubali 2 : The Conclusion' had requested Telangana government for permission to hold five shows per day during the first week of the film's release. According to sources the Telangana government has officially permitted the makers of the film to screen 5 shows a day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu