twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజుకు 6 షోలు: బాహుబలి 2 కోసం ప్రత్యేక అనుమతి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సాధారణ థియేటర్లలో రోజు 4 షోలు వేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయితే బాహుబలి 2 సినిమా కోసం ఏపీ సర్కార్ కాస్త నిబంధనలను సడలించింది. మరో రెండు షోలు అదనంగా ప్రదర్శించేందుకు అనుమతి మంజూరు చేసింది.

    తెలుగులో మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఖర్చు పెట్టి తీసిన సినిమా కావడం, తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాయతీయ స్థాయికి తీసుకెళ్లిన మూవీ కావడంతో 'బాహుబలి 2' కోసం ఈ ప్రత్యేక అనుమతి ఇచ్చారు.

    తొలి 10 రోజులు మాత్రమే

    తొలి 10 రోజులు మాత్రమే

    ఏప్రిల్ 28న బాహుబలి 2 మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో .... తొలి ప‌ది రోజుల పాటు పాటు ఈ ప్రత్యేక అనుమతి లభించింది. ఈ పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు ఆరు షో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చారు.

    తెలంగాణలో కూడా?

    తెలంగాణలో కూడా?

    తెలంగాణలో కూడా ఈ సినిమా ఎక్కువ షోలో వేసేందుకు ప్రభుత్వం నుండి అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా సినిమాకు ఓపెనింగ్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

    హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్స్

    హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్స్

    శనివారం నుండే బాహుబలి 2 టికెట్స్ ఆన్ లైన్లో అమ్మానికి పట్టారు. ఆన్ లైన్లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. షోల సంఖ్య పెరిగితే మరిన్ని టికెట్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    బాహుబలి... ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

    బాహుబలి... ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

    ప్రభాస్ లాంటి డెడికేటెడ్ హీరో లేకుంటే 'బాహుబలి' సినిమా చేయడం కష్టం అని రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ప్రభాస్ ఈ ప్రాజెక్టు కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Baahbali's conclusive part is ready for a release on 28 th of April and the AP Government has given this movie a huge exemption of running six shows a day , in the state. The AP Government has released a GO allowing Baahubali 2 to run for 6 shows from 28 th of April till 7 th of May.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X