ప్రభాస్ నాతో టచ్‌లో లేడు.. ఆ గొడవ జరిగాక మాట్లాడడం మానేశా.. కంగనా రనౌత్!
Recommended Video

బాహుబలి తరువాత జాతీయ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ప్రభాస్ సినిమా సినిమాల గురించి దేశవ్యాప్తంగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు కూడా అదే విధంగా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా ఏక్ నిరంజన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి సంగతులని కంగన గుర్తు చేసుకుంది.

చెలరేగుతున్నారు
ప్రభాస్ బాహుబలి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కంగనా రనౌత్ కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నా నటిగా చెలరేగిపోతోంది. కంగనా రనౌత్ కు బాలీవుడ్ లో భారీ డిమాండ్ నెలకొని ఉంది. కంగనా రనౌత్ మాట్లాడుతూ ఏక్ నిరంజన్ చిత్ర షూటింగ్ లో భాగంగా ప్రభాస్ తో జరిగిన గొడవని గుర్తు చేసుకుంది.

ఒక గొడవ జరిగింది
ప్రభాస్, కంగన రనౌత్ జంటగా నటించిన చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ చిత్ర షూటింగ్ లో తాను ప్రభాస్ ఓ విషయం లో గొడవపడ్డామని కంగనా రనౌత్ తెలిపింది. ఆ గొడవ తరువాత చాలా రోజులు మేమిద్దరం మాట్లాడుకోవడం మానేసాం అని కంగనా తెలిపింది. కానీ ఏ విషయంలో గొడవ జరిగిందో మాత్రం కంగన వివరించలేదు.

టచ్‌లో లేడు
ఏక్ నిరంజన్ షూటింగ్ తరువాత ప్రభాస్ నాతో టచ్‌లో లేడు. ఆ తరువాత మళ్ళీ బాహుబలి చిత్రంతో ప్రభాస్ పేరు విన్నా. బాహుబలి సినిమా నేను చూశా. చాలా అద్భుతంగా నటించాడు. నా నటన గురించి కూడా అతడికి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా.

వీరనారి పాత్రలో
కంగన రనౌత్ ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో మణికర్ణిక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. క్వీన్ వంటి చిత్రాలలో అద్భుత నటన కనబరిచిన కంగన, మణికర్ణిక చిత్రంతో అబ్బురపరిచే పోరాట సన్నివేశలతో అదరగొడుతోంది.


Click it and Unblock the Notifications











