»   » ఆయన్ని రప్పించారు: ‘బాహుబలి’కి ఇంటర్నేషల్ హైప్!

ఆయన్ని రప్పించారు: ‘బాహుబలి’కి ఇంటర్నేషల్ హైప్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ‘బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగం....ఈ వేసవిలో విడుదల కాబోతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వారు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

‘బాహుబలి' సినిమాకు ఇంటర్నేషనల్ హైప్ తేవడంలో భాగంగా...ప్రొడక్షన్ టీం ఆసియాకు చెందిన ప్రముఖ ఎడిటర్ జామేస్ మార్ష్‌కు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఆసియాకు సంబంధించిన సినిమాలపై ఆయన రాసే ఆర్టికల్స్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని ‘బాహుబలి' సెట్స్ ను సందర్శించిన ఆయన ‘బాహుబలి' సినిమా మేకింగుపై ఆర్టికల్ రాయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పలు ఇంటర్నేషనల్ మేగజైన్లలో బాహుబలి గురించిన ఆర్టికల్స్ రానున్నాయని తెలుస్తోంది.

అబ్బురపరుస్తున్న ‘బాహుబలి' సెట్స్ (ఫోటోస్)
ఇప్పటికే బాహుబలి సెట్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ అయ్యాయి. అబ్బుర పరిచేలా ఉన్న సెట్టింగులు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇక సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నారు.

 Baahubali

దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని ‘బాహుబలి.. ది బిగినింగ్' పేరుతో విడుదల చేస్తున్నారు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం హాలీవుడ్ సినిమా రేంజిలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

English summary
Recently, Baahubali team have invited Jamesh Marsh, a well known Asian editor who is internationally renowned for his writings of Asian cinema,to visit the sets of Baahubali in Ramoji Film City.
Please Wait while comments are loading...