»   » బాహుబలి... ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బాహుబలి... ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ లాంటి డెడికేటెడ్ హీరో లేకుంటే 'బాహుబలి' సినిమా చేయడం కష్టం అని రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. నిజమే... ప్రభాస్ మాదిరిగా ఏ స్టార్ హీరో కూడా తన నాలుగుగైదేళ్ల సమయాన్ని కేవలం ఒకే సినిమాకు కేటాయించే సాహసం చేసి ఉండేవాడు కాదేమో.

అయితే ప్రభాస్ తీసుకున్న రిస్కుకు, పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కింది. అప్పటి వరకు కేవలం ప్రాంతీయ హీరోగా ఉన్న ప్రభాస్.... బాహుబలి రిలీజ్ తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు.


ఒక వేళ బాహుబలి సినిమా చేసి ఉండకపోతే ఈ గ్యాపులో ప్రభాస్ కనీసం ఎనిమిది సినిమాలైనా చేసి ఉండేవాడు...ఆ సినిమాల ద్వారా ప్రభాస్ ఎంత సంపాదించేవాడో ఒక్కసారి ఊహించుకోండి? మరి ప్రభాస్ ఇన్నేళ్ల త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కిందా? అంటే అవుననే అంటున్నారు.


మొదట ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అనుకున్నారు?

మొదట ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అనుకున్నారు?

బాహుబలి ప్రాజెక్టు అనుకున్నప్పుడు... అంటే ఐదేళ్ల క్రితం ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ. 5 కోట్లకు కాస్త అటు ఇటుఇటుగా ఉండేది. అప్పుడు బాహుబలి ప్రాజెక్టుకు అనుకున్న బడ్జెట్, ప్రభాస్ నుండి తీసుకునే డేట్స్ బేరీజు వేసుకుని రూ. 20 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలని అనుకున్నారట.


బాహుబలి పార్ట్ 1 హిట్ తర్వాత సీన్ మారింది

బాహుబలి పార్ట్ 1 హిట్ తర్వాత సీన్ మారింది

అయితే బాహుబలి పార్ట్ 1 భారీ విజయం తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ముందు ఊహించిన దానికంటే సినిమా మార్కెట్ కూడా బాగా పెరగడంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా పెంచేసారు. రెండు ప్రాజెక్టులకు కలిపి ప్రభాస్ కు రూ. 75 కోట్లు రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం.


ప్రభాస్ లైఫ్ మారిపోయింది

ప్రభాస్ లైఫ్ మారిపోయింది

బాహుబలి సినిమాతో ప్రభాస్ లైఫ్ మారిపోయింది. రీజనల్ స్టార్ నుండి నేషనల్ స్టార్ అయ్యాడు. ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా అంటే అది కేవలం తెలుగు బాషకే పరిమితం కాదు...హిందీ, తమిళం ఇలా మల్టీ ల్వాంగేజ్ మూవీ. సాహో సినిమాయే అందుకు నిదర్శనం. సాహో సినిమాకు ప్రభాస్ రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.


ప్రభాస్

ప్రభాస్

బాహుబలి స్టార్ కాబట్టి ఆయన నుండి వచ్చే ఏ సినిమాపై అయినా అంచనాలు భారీగానే ఉంటాయి. ఆ అంచనాలకు తగిన విధంగానే కథలు ఎంచుకుంటున్నాడు ప్రభాస్.English summary
As per reliable sources, Prabhas was paid a mind-boggling amount by Producers of 'Baahubali'. Makers offered anywhere close to Rs 20 crore initially for both parts. After the humongous success of Part 1, They have the luxury to offer even more for the Lead Actor and hence paid him a whooping Rs 75 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu