»   » ‘బాబు బాగా బిజీ’ సెక్స్ సీన్‌‍పై సెన్సార్ అభ్యంతరం!

‘బాబు బాగా బిజీ’ సెక్స్ సీన్‌‍పై సెన్సార్ అభ్యంతరం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పటితో పోలిస్తే సెన్సార్ బోర్డు నిబంధనలు ఇపుడు చాలా స్ట్రిక్టుగా ఉన్నాయి. ఏదైనా అడల్ట్ కంటెంటుతో సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి. కథకు ఎంతో కీలకంగా ఉండే సీన్లు సెన్సార్ కత్తెరకు బలవుతాయనే ఆందోళనే అందుకు కారణం.

కొందరు ఫిల్మ్ మేకర్స్ పలు సందర్భాల్లో సెన్సార్ బోర్డు వారితో గొడవపడ్డ సందర్భాలు సైతం ఉన్నాయి. తాజాగా తెలుగులో అడల్ట్ కంటెంటుతో తెరకెక్కుతున్న 'బాబు బాగా బిజీ' అనే సినిమా విషయంలో కూడా సెన్సార్ బోర్డుతో పెద్ద సమస్యే వచ్చింది.

ఆ సెక్స్ సీనే కారణం

ఆ సెక్స్ సీనే కారణం

సినిమా కథలో భాగంగా.... అవసరాల శ్రీనివాస్, తెలుగు బ్యూటీ సుప్రియా ఐసోలా మధ్య కొన్ని సెక్స్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి సీన్లతో తాము సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని బోర్డు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.

ప్రొడ్యూసర్ వాదన

ప్రొడ్యూసర్ వాదన

అయితే ప్రొడ్యూసర్ సెన్సార్ బోర్డుతో.... సినిమాలో అశ్లీలం ఏమీ లేదని, తమకు యూ/ఎ సర్టిఫికెట్ ఇవ్వాలని వాదనకు దిగినట్లు సమాచారం. అడల్ట్ కంటెంటు ఉన్న సినిమాలకు అలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పారట.

A సర్టిఫికెట్

A సర్టిఫికెట్

అయితే చివరకు సెన్సార్ బోర్డు ఈ చిత్రంలో అడల్ట్ కంటెంటు ఉన్నందున పెద్దలకు మాత్రమే అని A సర్టిఫికెట్ జారీ చేసింది. మే 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెక్స్ ‘అవసరాల’ను భలే చెప్పాడు...(బాబు బాగా జిజీ ట్రైలర్)

బాబు బాగా బిజీ అనే చిత్రం హిందీలో తెరకెక్కిన ‘హంటర్' మూవీ సినిమాకు రీమేక్. సెక్స్ కూడా మనిషికి ఫిజికల్ నీడ్ అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
'Babu Baga Busy movie have some some sex scenes. Censor board has objected to those scenes and rejected certificate for the movie. The producers approached the revising committee demanding 'U/A' certificate for the film later. They have finally passed 'Babu Baga Busy' with 'A' certificate today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu