బర్త్ డే గిఫ్ట్: బాలయ్య కోసం కూతుళ్ల ఖరీదైన బహుమతి (ఫోటోస్)
బాలయ్య పుట్టినరోజు వేడుక పోర్చుగల్ లో జరిగింది. పుట్టినరోజు సందర్భంగా బాలయ్యకు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్వి సర్పైజ్ ఇచ్చారు.
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ఈ నెల 10న యాబైఏడవ వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునే బాలయ్య ఈ సారి మాత్రం అభిమానులను మిస్సయ్యారు.
పూరి దర్శకత్వంలో చేస్తున్న 'పైసా వసూల్' సినిమా షూటింగ్ కారణంగా పోర్చుగల్ ఉన్నారు. కాగా పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్వి ఆయనకు సర్పైజ్ ఇచ్చారు.

ఖరీదైన బెంట్లీ కారు బహుమతి
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఖరీదైన బెంట్లీ కారును బహుమతి ఇచ్చారు బ్రాహ్మణి, తేజస్వి. అక్కడికి కారు తీసుకెళ్లేరు కాబట్టి కారు తాళాల బాక్స్‌ను తండ్రికి అందించారు.

ఘనంగా వేడుక
పోర్చుగల్ లో జరిగిన బాలయ్య పుట్టినరోజు వేడుకలో ‘పైసా వసూల్' యూనిట్ సభ్యులతో పాటు బాలకృష్ణ సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, అల్లుళ్లు నారా లోకేశ్, శ్రీభరత్, మనవడు దేవాంశ్, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

బాలయ్య ఎప్పటికీ మరిచిపోలేని వేడుక
తన కోసం కుటుంబ సభ్యులంతా పోర్చుగల్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోయే పుట్టినరోజు వేడుక ఇది అని బాలయ్య అన్నారు.

పైసా వసూల్
బాలయ్య నటిస్తున్న 101వ సినిమాకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘పైసా వసూల్' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లు సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











