పూరి జగన్నాథ్-పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే.. మరో వైపు రాజకీయ పనులు, ఎన్నికలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. అలా పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పి ఉన్నాడు. ఇందులో అన్ని కాంబోలు ఫిక్స్ అయ్యాయి. కానీ బండ్ల గణేష్ మూవీ మాత్రం ఎలాంటి అప్డేట్ లేకుండా ఉంది.

పవన్ కళ్యాణ్ ఇలా..

పవన్ కళ్యాణ్ ఇలా..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత వెంటనే క్రిష్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతాడు. అది లైన్‌లో ఉండగానే హరీష్ శంకర్ సినిమాను కూడా మొదలుపెడుతాడు. ఇవన్నీ అయ్యాక బండ్ల గణేష్ సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి.

బండ్ల గణేష్ అలా..

బండ్ల గణేష్ అలా..

నా దేవుడు మళ్లీ నాకు చాన్స్ ఇచ్చాడు అంటూ ఆ మధ్య బండ్ల గణేష్ ఓ పోస్ట్ చేశాడు. అంతే తప్పా ఎక్కడా కూడా అధికారికంగా తన బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని చెప్పలేదు. మిగతా వివరాలేవీ కూడా ప్రకటించలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా కొన్ని రూమర్లు బయటకు వచ్చాయి.

ఆ స్పెషల్ కాంబో..

ఆ స్పెషల్ కాంబో..

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా ఉంటుందని, కానీ దర్శకుడు మాత్రం దొరకడం లేదని ఇంత కాలం ఎదురుచూశారట. అయితే పూరి జగన్నాథ్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను తీసుకోవాలని, డైరెక్షన్ చేయాలని శ్రద్ద చూపిస్తున్నాడు. త్వరలోనే అనౌన్స్ మెంట్ రాబోతోందనే రూమర్లు వచ్చాయి.

 బండ్ల గణేష్ క్లారిటీ..

బండ్ల గణేష్ క్లారిటీ..


నా బ్యానర్‌లో సినిమా ఫిక్స్ అయితే నేనే అధికారికంగా ప్రకటిస్తాను అంత వరకు ఎలాంటి రూమర్లను నమ్మకండి అంటూ బండ్ల గణేష్ అందరినీ వేడుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా లేనట్టేనా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 ఇప్పటికే అలా..

ఇప్పటికే అలా..

పూరి జగన్నాథ్ బండ్ల గణేష్ కాంబోలో ఇద్దరమ్మాయిలతో, టెంపర్ సినిమాలు వచ్చాయి. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కాంబోలో తీన్మార్, గబ్బర్ సింగ్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబోలో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X