యాభై లక్షలు మోసపోయిన పూరి.. ఐదు కోట్లు ఇప్పించిన బండ్ల గణేష్!!
బండ్ల గణేష్ అంటే కేవలం సినిమా రంగానికి చెందినవాడే కాదు. రియల్ స్టేజ్, కోళ్ల ఫాం, ఇతరేతర వ్యాపారాలతో సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నవాడు. షాద్ నగర్ గణేష్‌ను కాస్త బండ్ల గణేష్‌ను చేసింది సినిమా పరిశ్రమ. అయితే బండ్లన్న మాత్రం రియల్ ఎస్టేట్‌లో ఎంతో ఎదిగి సినిమా రంగానికి చెందిన కొందరికి ఎంతో సాయం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు బండ్లన్న తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నాడు.
Recommended Video

ఒక్కరూపాయి తీసుకురాలేదు..
ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. కానీ ఈ రోజు ఎంతో సంపాదించాను. ఎంతో పేరు సంపాదించాను. నేను పడినన్న కష్టాలు ఎవ్వరూ పడి ఉండరు. నేను పెద్ద ఆర్టిస్ట్‌ను కూడా కాను కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద సినిమాలను నిర్మించేంతగా ఎదిగాను అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

పూరితో అనుబంధం..
పూరి జగన్నాద్‌తో అనుంబంధం ఇండస్ట్రీకి రాకముందు నుంచీ ఉండేది.ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి పూరి గారు తెలుసు. నాకంటే కొంచెం జూనియర్. అలా అప్పటి నుంచే పూరి జగన్నాద్‌తో పరిచయం. పాండు సినిమా సమయంలో ఎంతో మంది దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేయించి కథలు చెప్పించేవాడిని. కానీ ఏ ఒక్కటి వర్కౌట్ కాలేదు. అని బండ్ల గణేష్ తెలిపాడు.

సినిమాలో అవకాశం..
నేను పూరి జగన్నాద్‌కు ఎలాంటి ఛాన్స్ ఇప్పించలేకపోయినా.. ఆయన తీసే సినిమాల్లో నన్ను పెట్టుకున్నారు. ఎంతో ప్రోత్సహించారు. ఓ సారి ఆయన ఆఫీస్‌కు వెళ్లాను. డోర్ తీయడంతోనే డాక్యుమెంట్లను విసిరిపడేశాడు. అవి నా కాళ్ల కింద పడ్డాయి. అందులో షాద్ నగర్ అని కనిపించింది అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

యాభై లక్షలకు ఐదు కోట్లు..
ఆ డ్యాకుమెంట్స్ ఏంటని పూరి జగన్నాద్‌ను అడిగాను. షాద్ నగర్‌లో యాభై లక్షలకు ఓ ల్యాండ్ కొన్నాను. వాడు మోసం చేశాడు అని పూరి జగన్నాద్ అన్నాడు. ఈ డ్యాకుమెంట్స్ నేను తీసుకుంటాను.. వాటిని క్లియర్ చేసి ఇస్తాను అని చెప్పాను. అవి తీసుకెళ్లి ఐదు కోట్లు తెచ్చి ఇచ్చాను అని బండ్ల గణేష్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











