»   »  ఆ డైరెక్టర్ వెధవ.. అసహ్యం.. బండ్ల గణేష్ టార్గెట్ ఆ దర్శకుడేనా!

ఆ డైరెక్టర్ వెధవ.. అసహ్యం.. బండ్ల గణేష్ టార్గెట్ ఆ దర్శకుడేనా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బేసిగ్గా నేను పనిచేసిన డైరెక్టర్లో ఈ మధ్యలో కాదుగానీ పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. హరీశ్ శంకర్, శ్రీను వైట్ల హిట్ కొట్టే తపన ఉన్న డైరెక్టర్లు అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు.

ఇటీవల idreampost.com కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ డైరెక్టర్ పై నిర్మాత బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను పనిచేసిన డైరెక్టర్లో ఓ వ్యక్తితో పనిచేయాల్సి రావడం ఖర్మ అని తలబాదుకొన్న పనిచేశారు.

ఆ డైరెక్టర్ పేరు చెప్పను..

ఆ డైరెక్టర్ పేరు చెప్పను..

‘ఏదో విధంగా సినిమా నిధానంగా తీయాలి. సినిమా అంటే ఇష్టం లేకుండా అబ్బా ఓ డైరెక్టర్ తో ఈ మధ్యలో పనిచేశాను. ఏడుపు వచ్చేది. ఆ డైరెక్టర్ పేరు చెప్పను, వాడి పొట్ట ఎందుకు కొట్టాలి. వీడితో సినిమా తీసున్న ఏందని ఫీల్ అయ్యాను. ఖర్మ, రాత్రైతే మందు తాగడం, డ్రగ్స్ తాగడం తప్ప వేరే ఆలోచనలేదు' అని గణేష్ అన్నారు.

దేవుడు వాడికి లైఫ్ కూడా ఇవ్వోద్దని ఫీల్ అవుతా

దేవుడు వాడికి లైఫ్ కూడా ఇవ్వోద్దని ఫీల్ అవుతా

అంతేకాకుండా ‘ఆ డైరెక్టర్ వెధవ. భగవంతుడు కూడా వాడికి లైఫ్ ఇవ్వొద్దని ఫీల్ అవుతాను. అతన్ని తాను పరిచయం చేయలేదు అని, అప్పటికే పెద్ద దర్శకుడు. వాడికి డైరెక్షనే రాదు. షాట్ చెప్పి.. ఏదో చేస్తుంటాడు' అని తీవ్రంగా స్పందించారు.

నాలుగు షాట్లు మంచిగా తీస్తే డైరెక్టర్ కాడు.

నాలుగు షాట్లు మంచిగా తీస్తే డైరెక్టర్ కాడు.

‘సినిమా అంటే గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తుంటాం. తిరుపతి వేంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్లి ఫోన్ లో వాట్సప్ చూసుకోవడం. రాత్రికి ఏం మందు తాగాలి అని ఆలోచిస్తుంటాడు. గొప్ప పేరుంది. అతనంటే అసహ్యం. చెప్పిన కథ చెప్పలేడు. నాలుగు షాట్లు మంచిగా తీస్తే డైరెక్టర్ కాడు. చెప్పిన సమయానికి సినిమా తీసేవాడే డైరెక్టర్'అని అభిప్రాయపడ్డారు.

రాంచరణ్ అండగా నిలిచారు కాబట్టే

రాంచరణ్ అండగా నిలిచారు కాబట్టే

కొన్ని సందర్భాల్లో తాను ఇబ్బందుల్లో పడినప్పుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ అండగా నిలిచారని, దాంతోనే చాలా కష్టాలు తొలగిపోయాయని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు బండ్ల గణేష్ పరుశురాం, పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల, హరీశ్ శంకర్, కృష్ణవంశీ, జయంత్ సీ పరాన్జీతో కలిసి పనిచేశారు.

English summary
Bandla Ganesh reveal his opinion on tollywood director. Ganesh said He has good relations with Puri Jagannadh, Harish Shankar, Srinu Vaitla and others. He faced problems with particularily with one director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu