రామ్ చేసిన పనికి ఛార్మీ, పూరీకి నోటీసులిచ్చిన కర్నాటక అధికారులు

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకున్నప్పటికీ, క్రమంగా హిట్ చిత్రంగా నిలిచింది 'ఇస్మార్ట్ శంకర్'. టాక్ మాత్రమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసింది. ఇప్పటికి ఈ సినిమా రూ. 70 కోట్లు పైచిలుకు గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు కర్నాటక అధికారులు షాక్ ఇచ్చారు. 'ఇస్మార్ట్ శంకర్' ప్రదర్శితమవుతున్న బెంగళూరులోని మంత్రి మాల్ ఐనాక్స్ సినిమా కాంప్లెక్స్‌లో హీరో రామ్ సిగరెట్ తాగుతున్న పోస్టర్లను అక్కడ డిస్ప్లే చేశారు. దీనిపై ఎటువంటి హెచ్చరికలు ఇవ్వలేదు. దీంతో ఇది పబ్లిక్ ని ప్రేరేపించే విధంగా ఉందని కొప్టా యాక్ట్ (పొగాకు మరియు ఇతర సంబంధిత ఉత్పత్తుల చట్టం)ప్రకారం థియేటర్ యాజమాన్యం సినిమా దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. దీనికి పూరీ, ఛార్మీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Bangalore Officers gave shock to ismart shankar team

గతంలో రామ్‌కు చార్మినార్‌ పోలీసులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. చార్మినార్‌ పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చార్మినార్‌ పోలీసులు తెలిపారు. రామ్‌తో కలిపి ఇప్పటికి వరకు చార్మినార్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాల్చిన 22మందికి 'కోప్టా' (సిగరేట్‌ అదర్‌ టోబాకో ప్రొడక్ట్‌) చట్టం కింద జరిమానాలు విధించారు. బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ధూమపానం చేయడాన్ని నేరంగా పరిగణించి జరిమానా విధిస్తామని హైదరాబాద్‌ పోలీసులు ఇది వరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X