మరో పదేళ్ల వరకు విడిపోకుండా ప్లాన్ రెడీ చేసుకున్న పూరి జగన్నాథ్, ఛార్మి.. కేవలం సినిమాలే కాకుండా..
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ అనగానే మార్కెట్ లో ఒక స్పెషల్ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా హీరో, డైరెక్టర్ కాంబినేషన్ లో వరుసగా సినిమాలు వచ్చిన ప్రతిసారి హైప్ క్రియేట్ అవుతుంది. ఇక ఇప్పుడు కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ప్రస్తుతం ఛార్మి కౌర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ పై కూడా అలాంటి హైప్ ఎక్కువగా క్రియేట్ అవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ కాంబో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ జోష్ ఇప్పట్లో తగ్గేలా లేదని తెలుస్తోంది.

కష్టపడినా కూడా..
హీరోయిన్ గా సక్సెస్ అవ్వడానికి ఛార్మి కౌర్ చాలానే కష్టపడింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చాలానే చేసింది. కానీ ఆమె దురదృష్టం ఏమిటో గాని అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక పూరి జగన్నాథ్ తో జ్యోతి లక్ష్మీ సినిమా అనంతరం ఆమె కెరీర్ మరొక యూ టర్న్ తీసుకుంది. నటనకు ఎండ్ కార్డ్ పెట్టి ప్రొడక్షన్ హౌజ్ లోకి దిగింది.

సేవింగ్స్ మొత్తం అందులోనే..
హీరోయిన్ గా అంతవరకు సంపాదించిన సేవింగ్స్ మొత్తం ప్రొడక్షన్ హౌజ్ లో ఇన్వెస్ట్ చేసిన ఛార్మి మొదట్లో కాస్త ప్లాప్స్ ఎదుర్కొంది. ఇక మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ అందుకొని భారీ లాభాలను అందుకుంది. పూరి కనెక్ట్స్ లో పాట్నర్ గా ఉంటూ సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ పనులన్నింటిని తనే చూసుకుంటోంది.

మరో పదేళ్ల వరకు..
ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన హిట్టుతో పూరి జగన్నాథ్, ఛార్మి లో ఒక కొత్త ఉత్సాహం మొదలైంది. అందుకే వీరు మరో పదేళ్ల వరకు సరిపోయే కథలను రెడీ చేసుకున్నారట. ఈ లాక్ డౌన్ లో పూరి జగన్నాథ్ దాదాపు 10 కథలను రెడీ చేసినట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ OTT ఫ్లాట్ ఫార్మ్ కోసం మరికొన్ని కథలను రెడీ చేశారట. ఏ మాత్రం స్లో అవ్వకుండా ఈ పదేళ్లలో వీలైనన్ని మంచి సినిమాలు చేయాలని ప్లాన్ వేసుకున్నారు. నెక్స్ట్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.
Recommended Video

యాక్టింగ్ పై క్లారిటీ ఇచ్చిన ఛార్మి
ఛార్మి తన యాక్టింగ్ కెరీర్ పై ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. నటనలో సెకండ్ ఇన్నింగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా అని అడిగితే.. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని చెబుతోంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ప్రొడక్షన్ హౌజ్ పైనే ఉందని ఈ పని తనకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తోందని వివరణ ఇచ్చింది. ఇక ఛార్మి ఇచ్చిన క్లారిటీతో ఆమె మళ్ళీ సినిమాలో నటించబోతోంది అనే రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది.


Click it and Unblock the Notifications











