కన్నీళ్లు ఆగడం లేదు.. వెనక్కి తిరిగి చూసుకుంటే..! ఛార్మి ఎమోషనల్ కామెంట్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ విజయవంతంగా 100 రోజులు పూర్తిచేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా హంగామా ఇంకా కనిపిస్తోందంటే ఆ విజయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంచనాలను మించి పర్ఫామ్ చేసిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించడమే గాక నటీనటులకు మంచి లైఫ్ ఇచ్చింది. జులై 18వ తేదీన విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసింది ఇస్మార్ట్ శంకర్.
చాలాకాలం తర్వాత పూరి జగన్నాథ్‌కి హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్.. చిత్ర యూనిట్ అందరిలోనూ జోష్ పెంచింది. హీరోహీరోయిన్లు రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ అందరూ ఈ సినిమాతో పూర్తి సంతృప్తి పొందారు. కాగా ఇస్మార్ట్ శంకర్ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ వేరు వేరుగా ట్వీట్స్ చేస్తూ తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా హీరో రామ్ ట్వీట్ చేస్తూ ''ఇస్మార్ట్ శంకర్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది నా జీవితంలో కొత్త దశ. ఈ సినిమా కారణంగా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా. థాంక్యూ పూరి జగన్నాథ్ గారు. మీతో కలిసి పని చేయడాన్ని ప్రేమిస్తున్నా..'' అని పేర్కొనగా నిర్మాత చారని తనదైన కోణంలో ట్వీట్ చేసి ఎమోషనల్ అయింది.
ట్విట్టర్ వేదికగా ఇస్మార్ట్ శంకర్ తాలూకు ఓ వీడియో షేర్ చేసిన ఛార్మి.. ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, కలల ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందించామని పేర్కొంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం జీవితాలను అంకితం చేసిన తామంతా ఇప్పుడు ఆ కల నిజమైందని గర్వంగా ఫీల్ అవుతున్నామని పేర్కొంది.


Click it and Unblock the Notifications











