‘ఇస్మార్ట్’ షూటింగ్‌లో భయానక సందర్భం.. చనిపోతామని టెన్షన్ పడ్డానంటూ వీడియో షేర్ చేసిన ఛార్మీ

Recommended Video

Charmy Kaur Shares A Tensed Video In Ismart Shankar Shooting || Filmibeat Telugu

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజాగా నటించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టుకుంది. దీంతో చిత్ర యూనిట్ యమ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో టూర్లు కూడా వెళ్తోంది. ఇక, తాజాగా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ ఓ వీడియోను షేర్ చేసి కలకం రేపింది.

భారీ కలెక్షన్లు

భారీ కలెక్షన్లు

‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైనప్పటి నుంచి జోరు మాత్రం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే రెండు వారాలు పూర్తయ్యే సరికి మొత్తంగా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 32.70 కోట్లను కొల్లగొట్టిందీ సినిమా. అలాగే పక్క రాష్ట్రం కర్ణాటకలో రూ. 1.45 కోట్లను, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా రూ. కోటి వరకు రాబట్టింది.

ఛార్మీదే అంతా

ఛార్మీదే అంతా

ఈ సినిమా సక్సెస్‌లో హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పాత్ర ఎంతో ఉన్నా.. ఛార్మీ చొరవను కూడా గుర్తించక తప్పదు. దీనికి సహ నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీ.. అన్నీ తానై చూసుకుంది. షూటింగ్ నుంచి ప్రమోషన్ల వరకు ఆమె చేసిన కృషి కనపడింది. అందుకే విజయోత్సవాల్లో ఆమె ఆనందం కనిపించింది.

చనిపోతామని భయపడ్డాం

షూటింగ్ సమయంలో జరిగిన భయానక సంఘటనకు సంబంధించిన పరిస్థితిని వివరిస్తూ ఛార్మీ ‘‘ఇది మాల్దీవుల్లోని ఇసుక ద్వీపం. ఇక్కడ కొద్ది సమయం మాత్రమే ఇసుక కనిపిస్తుంది. తర్వాత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఈ ప్రదేశంలో ‘ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని ‘ఉండిపో' పాటకు సంబంధించిన కొన్ని షాట్స్ తీశాం. షూటింగ్ సమయంలో మేము మునిగిపోతామేమోనన్న భయం అనిపించింది. అందుకే అందరిని వచ్చేయమని చెప్పాను'' అని ట్వీట్ చేసింది.

వీడియో కూడా షేర్ చేసింది

వీడియో కూడా షేర్ చేసింది

ఛార్మీ ఓ వీడియోను కూడా షేర్ చేసింది. అందులో ‘రండి.. రండి.. రండయ్యా.. అందరూ వచ్చేయండి. త్వరగా రండి. అందరినీ రమ్మని చెప్పండి కమ్ ఫాస్ట్' అంటూ ఆమె కంగారు పడిపోయింది. అదే సమయంలో పూరీ జగన్నాథ్ కూడా కిందే ఉన్నాడు. అందరినీ అలెర్ట్ చేసిన తర్వాత ఛార్మీ.. పూరీ సాయంతో బోట్‌లో ఎక్కింది.

ఇస్మార్ట్ గురించి

ఇస్మార్ట్ గురించి

పూరీ - రామ్ కలయికలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'జ పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X