అలాగే తిట్టు వర్మ.. జగన్‌ ఇట్లైనా దారికొస్తాడేమో! అబ్బో.. ఛార్మి రచ్చ మామూలుగా లేదుగా

నిన్న (శనివారం) ఇస్మార్ట్ శంకర్ టీమ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, నిధి అగర్వాల్, నభా నటేష్ అందరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ లో శ్రీరాములు థియేటర్ లో ఇస్మార్ట్ శంకర్ మాస్ మసాలా పవర్ చూసిన వర్మ ఫుల్లుగా రెచ్చిపోయి బీర్లతో హంగామా చేశాడు. ఈ సందర్బంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను బూతులు తిడుతూ వరుస ట్వీట్స్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్స్, వారి బీర్ల రచ్చ రెండూ సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. అయితే జగన్‌ని వర్మ తిట్టడంపై ఛార్మి ఆసక్తికరంగా స్పందించింది. ఇంకా తిట్టమంటూ ఫోర్స్ చేసింది. పూర్తి వివరాలు చూస్తే..

పొంగిన బీర్లు రచ్చ రచ్చ

పొంగిన బీర్లు రచ్చ రచ్చ

ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ బీర్లు పొంగించి ఛార్మి, ఇస్మార్ట్ హీరోయిన్లతో రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పైగా ఆ వీడియోలను ట్వీట్ చేస్తూ.. ‘‘నేను పిచ్చోడిని కాదు.. ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చోడిని చేసింది. కాబట్టి మీరు పూరీని, ఛార్మీనే నిందించాలి'' అంటూ ట్యాగ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

 అంతటితో ఆగక పూరి జగన్నాథ్‌పై బూతులు

అంతటితో ఆగక పూరి జగన్నాథ్‌పై బూతులు

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. వర్మ శిష్యుడు కావడంతో మాస్ పదజాలంతో పూరి జగన్నాథ్‌‌ని బూతులు తిట్టాడు వర్మ. అరేయ్ జగన్‌గా (పూరీ జగన్నాథ్).. ఇట్టాంటి బ్లాక్‌బస్టర్లు తీసే దమ్ముండి కూడా ఎందుకు తియ్వవురా బాడ్‌కవ్ అంటూ బూతుల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు వర్మ. అయితే ఈ ట్వీట్ పై ఛార్మి అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చి జగన్‌ని మరింత ఇరుకున పెట్టేసింది.

అలాగే తిట్టు వర్మ.. ఇట్లైనా దారికొస్తాడేమో!

''సార్ పూరి జగన్నాథ్‌కి నేను చాలా సార్లు చెప్పా. అతడి నుంచి ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ కోరుకుంటున్నారని. జగన్ ప్రధాన బలమే ఎంటర్‌టైన్మెంట్.. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా అది మరోసారి నిరూపించబడింది. అందుకే ఇలాగే ఇంకా తిట్టండి.. అట్లయితేనే పూరి హిట్లు కొడతాడు'' అని వర్మ ట్వీట్ పై ఛార్మి స్పందించింది.

‘ఇస్మార్ట్ శంకర్' మూవీ

‘ఇస్మార్ట్ శంకర్' మూవీ

సరైన విజయం కోసం పరితపిస్తున్న పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఆ దాహం తీర్చుకున్నారు. చిత్రంలో రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్ అభినయం ఆకట్టుకుంటోంది. పూరీ జగన్నాథ్ టేకింగ్ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తోంది. జూలై 18న రిలీజైన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X