ఫోన్‌కి డబుల్ సిమ్ కార్డ్ ఉన్నట్లే ఆ హీరోకి కూడా.. ఛార్మి సెన్సేషన్ కామెంట్
అందాల భామ ఛార్మికౌర్ గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. టాలీవుడ్ తెరకు గ్లామర్ ఒలకబోయడం ఎలాగో నేర్పింది ఈ ముద్దుగుమ్మ. వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోలతో రొమాన్స్ చేసిన ఈ భామ స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ కొట్టేసింది. హీరోల వలే తనకంటూ ఫ్యాన్స్ వర్గాన్ని కూడా ఏర్పరచుకొని మెల్లగా వెండితెర గ్లామర్ ప్రపంచానికి దూరమైంది ఛార్మి. ఇక పెళ్లి చేసుకుంటుందేమో అని భావిస్తున్న సమయంలో తెర వెనుక లీడర్‌గా అవతారమెత్తింది ఈ అందాల భామ. ప్రస్తుతం సినీ నిర్మాణ కార్యాక్రమాల్లో భాగమవుతూ ఇండీస్ట్రీలో కొనసాగుతోంది ఛార్మి.
తెరపై ఎంత యాక్టీవ్‌గా కెరీర్ ప్రారంభించిందో.. తెర వెనుక కూడా అంతే యాక్టీవ్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం నిర్మాతగా సినీ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. హీరోయిన్ గా ఫుల్ స్టాప్ పెట్టగానే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఛార్మి.. ఆ బ్యానర్ పై పలు సినిమాలు రూపొందిస్తూ అన్నీ తానై పూరితో వ్యాపార లావాదేవీల్లో పాలు పంచుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ పై తెరకెక్కుతున్న కొత్త సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఓ స్టిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఛార్మి దానిపై ఆసక్తికర కామెంట్ చేసింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ''డబుల్ దిమాక్'' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్, నభా నటేష్ ఆయనతో చిందులేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పై హీరో రామ్ తో స్టోరీ డిస్కస్ చేస్తున్న పిక్ షేర్ చేసిన ఛార్మి.. ''ఫోన్‌కి డబుల్ సిమ్ కార్డ్ ఉన్నట్లే, రామ్ కి డబుల్ దిమాక్ ఉంది'' అని అట్రాక్ట్ చేసే కామెంట్ చేసింది. అంటే ఛార్మి లెక్క ప్రకారం రామ్‌లో దర్శకత్వ ప్రతిభ కూడా కొద్దిగా ఉందనేగా అర్థం. ఇక 'ఇస్మార్ట్ శంకర్' సినిమా జులై 12 వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











