పూరీ, ఛార్మీ మీద కేసు పెడతా: ప్రముఖ కమెడియన్ ట్వీట్
డాక్టర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి యాక్టర్ అయ్యారు ప్రముఖ కమెడియన్ భద్రం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీ లీడ్‌లో నటించిన 'జ్యోతిలక్ష్మీ' సినిమాతో బాగా ఫేమస్ అయిన ఈయన.. ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'శతమానం భవతి' సహా ఎన్నో సినిమాల్లో మెరిశారు. ఈ సినిమాలన్నింటిలో చక్కటి నటనను కనబరిచి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ.. తన వృత్తిని కూడా వదిలిపెట్టలేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు డాక్టర్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
తాజాగా భద్రం 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చూశారు. ఇది చూసిన తర్వాత ఆయన దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ కౌర్‌పై కేసు పెడతానంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఇది చూసిన తర్వాత అందరూ ఏదో వివాదం జరిగిందని అనుకుంటున్నారు. ఇలాగే సోషల్ మీడియాలో షేర్లు చేసేస్తున్నారు. వాస్తవానికి అక్కడ జరిగింది వేరు. భద్రం ఈ సినిమా పట్ల పాజిటివ్‌గా ట్వీట్ చేశారు. దీన్ని చాలా మంది నెగెటివ్‌గా షేర్ చేస్తున్నారు.

భద్రం తన ట్విట్టర్ ఖాతాలో ''పూరీ జగన్నాథ్ సర్.. ఛార్మీ మేడమ్‌పై నేను కేసు ఫైల్ చేయించబోతున్నాను. నేను రోజూ మెడిటేషన్ చేస్తాను. కానీ, 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం చూసిన తర్వాత ధ్యానం చేయలేకుండా ఉన్నాను. ఈ సినిమా కోసం కొన్ని మెడిటేషన్ క్లాసులు మిస్ అవడం కూడా మంచిదే. ఈ ఇస్మార్ట్ వీకెండ్‌ను ఎంజాయ్ చెయ్యండి'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత అంతా క్లారిటీకి వస్తున్నారు.
ఇదిలాఉండగా, పూరీ జగన్నాథ్ - రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా మొదట మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, వసూళ్లను మాత్రం బాగా రాబడుతోంది. ఈ సినిమా బీ సీ సెంటర్లలో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తోంది. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











