»   » అంటే వాళ్లంతా దద్దమ్మలా?.... హరీష్ శంకర్ డిజె కామెంట్స్‌పై వివాదం!

అంటే వాళ్లంతా దద్దమ్మలా?.... హరీష్ శంకర్ డిజె కామెంట్స్‌పై వివాదం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'డిజె' ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా ఉన్నాయనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

బ్రాహ్మణులు అచ్చమైన తెలుగు మాట్లాడతారు... ఎందుకంటే వారు వెజిటేరియన్స్ అంటూ హరీష్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. అంటే నాన్ వెజ్ తినేవారంతా తెలుగు సరిగా మాట్లాడటం రాని దద్దమ్మలా? అంటూ ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.


డిజే ఆడియో వేడుకలో

డిజే ఆడియో వేడుకలో

డిజే ఆడియో వేడుకలో హరీష్ శకర్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.... ‘బన్నీ ఈ సినిమాలో బ్రాహ్మిణ్ బాయ్ క్యారెక్టర్ చేస్తున్నారు. బ్రాహ్మిణ్ స్లాంగ్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. నేనే ఆయనకు స్టోరీ చెప్పేప్పుడే..... నన్నొక ప్రశ్న అడిగారు. మీరు తెలుగు ఇంత చక్కగా, బాగా మాట్లాడతారు అని అడిగారని హరీష్ శంకర్ అన్నారు.


నాన్ వెజ్‌మానేస్తేనే సాధ్యమని చెప్పాను

నాన్ వెజ్‌మానేస్తేనే సాధ్యమని చెప్పాను

బన్నీ అలా అడగ్గానే... నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాను. మేము నాన్ వెజ్ తినమ అన్నాను. దీంతో బన్నీ వెంటనే తను క్యారెక్టర్ బాగా చేయాలని ఆలోచనలో అప్పటి నుండి నాన్ వెజ్ మానేశాడు అని హరీష్ శంకర్ తెలిపారు.


పరోక్షంగా హరీష్ మాట అదే...

పరోక్షంగా హరీష్ మాట అదే...

ఇలా మాట్లాడటం ద్వారా నాన్ వెజ్ తినే వారంతా తెలుగు సరిగా మాట్లాడటం రాని దద్దమ్మలని.... హరీష్ శంకర్ చెప్పకనే చెప్పారని, ఒక దర్శకుడు ఇలాంటి కామెంట్స్ చేయడం తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఫ్యామిలీతో హాజరైన బన్నీ

ఫ్యామిలీతో హాజరైన బన్నీ

కాగా డిజే ఆడియో వేడుకకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు. తన భార్య, కుమారుడు, కూతురుతో కలిసి వచ్చి ఆడియో వేడుకలో సందడి చేశాడు.


ఆకట్టుకున్న అయాన్

ఆకట్టుకున్న అయాన్

ఇలాంటి పెద్ద ఆడియో ఫంక్షన్ కు బన్నీ తన కుమారుడిని తీసుకుని రావడం ఇదే తొలిసారి. అయాన్ కూడా అందరినీ ఆశ్చర్య పరుస్తూ మెగా అభిమానులకు చేతులెత్తి నమస్కారం పెడుతూ తన వయసుకు మించిన మెచ్యూరిటీ చూపించాడు.


డిజే వేడుకలో ఫోజులు కొట్టిన అల్లు అర్జున్ కొడుకు, వెరీ క్యూట్ (ఫోటోస్)

డిజే వేడుకలో ఫోజులు కొట్టిన అల్లు అర్జున్ కొడుకు, వెరీ క్యూట్ (ఫోటోస్)

డిజే వేడుకలో ఫోజులు కొట్టిన అల్లు అర్జున్ కొడుకు, వెరీ క్యూట్


(ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)


నా కూతురు అలా ఎందుకందో తెలియదు, అదే నిజమైంది: దిల్ రాజు

నా కూతురు అలా ఎందుకందో తెలియదు, అదే నిజమైంది: దిల్ రాజు

నా కూతురు అలా ఎందుకందో తెలియదు, అదే నిజమైంది అని డిజే ఆడియో వేడుకలో దిల్ రాజు చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


ఆ విషాదాన్ని తలుచుకుని ... డిజే ఆడియో వేడుకలో అల్లు అర్జున్ ఎమోషన్!

ఆ విషాదాన్ని తలుచుకుని ... డిజే ఆడియో వేడుకలో అల్లు అర్జున్ ఎమోషన్!

డిజే ఆడియో వేడుకలో అల్లు అర్జున్ ఎమోషన్ అయ్యాడు. డిజే షూటింగ్ సమయంలో అనుకోని విషాదం మమ్మల్ని చాలా బాధ పెట్టిందని అన్నారు.


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


కట్టె కాలేంతవరకు ఆయన ఫ్యాన్‌నే.. ఆ డైలాగ్‌కు పవన్ స్ఫూర్తి.. ఉద్వేగంతో..

కట్టె కాలేంతవరకు ఆయన ఫ్యాన్‌నే.. ఆ డైలాగ్‌కు పవన్ స్ఫూర్తి.. ఉద్వేగంతో..

ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే... కట్టె కాలేంత వరకు పవన్ కళ్యాణ్ అభిమానినే అని హరీష్ శంకర్ అన్నారు.


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Director Harish Shankar’s remarks at the audio release function of Duvvada Jagannadham, might stir up trouble once again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu