»   » డిజే వేడుకలో ఫోజులు కొట్టిన అల్లు అర్జున్ కొడుకు, వెరీ క్యూట్ (ఫోటోస్)

డిజే వేడుకలో ఫోజులు కొట్టిన అల్లు అర్జున్ కొడుకు, వెరీ క్యూట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'డిజె-దువ్వాడ జగన్నాథమ్' ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో వేడుకలో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ సెంటాఫ్ అట్రాక్షన్‌‌గా మారాడు.

తండ్రితో కలిసి స్టేజీ మీదకు రాగానే..... అల్లు అయాన్ మెగా అభిమానుల వైపు తిరిగి తన తండ్రిని అనుసరిస్తూ చేతులెత్తి నమస్కరించాడు. సాధారణంగా ఈ వయసులో ఉండే పిల్లలు ఇంత పెద్ద క్రౌడ్ చూస్తే భయపడిపోయి తల్లిదండ్రుల చంకెక్కుతారు. అయితే అయాన్ మాత్రం ఎలాంటి భయం లేకుండా స్టేజీపై ఇలా చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.


అల్లు అయాన్

అల్లు అయాన్

అల్లు అయాన్ జోరు, తీరు చూస్తుంటే.... ఇంట్లో ఈ పిల్లోడికి ఇప్పటి నుండి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయాన్ స్పీడు చూస్తుంటే బాలనటుడిగా త్వరలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


ఫ్యూచర్ స్టార్

ఫ్యూచర్ స్టార్

ఇప్పటి నుండే అయాన్‌లో ఒక స్పార్క్ చాలా బావుందని, భవిష్యత్తులో హీరో అయ్యే యాటిట్యూడ్ కనిపిస్తోందని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. బుల్లి స్టైలిష్ స్టార్, ఫ్యూచర్ స్టైలిష్ స్టార్ అంటూ డిజే ఆడియో వేడుకలో నినాదాలతో హోరెత్తించారు.


తండ్రిని ఫాలో అవుతున్న తనయుడు

తండ్రిని ఫాలో అవుతున్న తనయుడు

యాటిట్యూడ్ విషయంలో మాత్రమే కాదు.... స్టైల్ విషయంలో కూడా అయాన్ తండ్రిని ఫాలో అవుతున్నాడు. తండ్రి ఏ డ్రెస్ వేసుకుననా తనకు అలాంటి డ్రెస్సే కావాలని ఇంట్లో మారాం చేస్తున్నాడట.


మా నాన్న పేరు అల్లు అర్జున్.. నేను మహేశ్ ఫ్యాన్‌ని

మా నాన్న పేరు అల్లు అర్జున్.. నేను మహేశ్ ఫ్యాన్‌ని

ఇటీవల అల్లు అయాన్ కు సంబంధించిన ఓ వీడియోను బన్నీ పోస్టు చేసాడు. అందులో అయాన్ ... మా నాన్న పేరు అల్లు అర్జున్, నేను మహేశ్‌బాబు ఫ్యాన్' అంటూ చెప్పిన వీడియో అప్పట్లో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Allu Arjun's son Allu Ayaan was the star of the show at DJ audio launch. The three year old cute boy stood the center of attraction with his cute antics and reactions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu