»   » దిల్ రాజు- సుకుమార్ మధ్య ‘జగడం’... అసలేం జరిగిదంటే?

దిల్ రాజు- సుకుమార్ మధ్య ‘జగడం’... అసలేం జరిగిదంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిర్మాత దిల్ రాజు తాను నిర్మించే సినిమాల విషయంలో కొన్సిసార్లు చాలా కఠినంగా ఉంటారనే పేరుంది. కొన్ని సార్లు ఆయన డైరెక్టర్ మాట కూడా వినరు. తనకు నచ్చిన విధంగానే సినిమాను తీసుకెళ్లాలనే ధోరణిలో ఉంటారనే వాదన ఉంది.

ఈ విషయమై ఇటీవల ప్రేమ ఇంటర్వ్యూలో దిల్ రాజు స్పందిస్తూ... ఏ సినిమా అయినా సక్సెస్ అయినపుడే ఆ సినిమాకు పని చేసిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మేలు జరుగుతుంది. ఒక రాంగ్ స్టెప్ వేసి సినిమా ప్లాప్ అయితే అందరికీ నష్టమే. అందుకే నేను ఎవరితో ఫైట్ చేసినా, ఏం చేసినా నేను సక్సెస్ కోసమే చేస్తాను. ఈ క్రమంలోనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని దిల్ రాజు తెలిపారు.

కొన్ని విషయాల్లో ఎవరిది వారికి రైట్ అనిపిస్తుంది. అయితే సినిమా ముందుకు వెళ్లాలంటే ముందు స్టెప్ తీసుకోవాల్సింది నిర్మాతే. నేను డబ్బులు పెడుతున్నాను కాబట్టి కాస్త కఠినంగానే ఉంటాను. సినిమా ఆడితేనే నాకు డబ్బు వస్తుంది. ఈ క్రమంలోనే దర్శకుడు సుకుమార్‌తో 'జగడం' సినిమా విషయంలో విబేధాలు వచ్చాయని దిల్ రాజు తెలిపారు.

సుకుమార్‌తో క్లోజ్ రిలేషన్

సుకుమార్‌తో క్లోజ్ రిలేషన్

సుకుమార్‌ నాకు దిల్ సినిమా నుండే పరిచయం. నాలుగైదు సంవత్సరాలు మా బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ‘జగడం' మూవీ ఆర్య తర్వాత బన్నీ, నేను, సుక్కు కలిసి చేయాల్సిన మూవీ. ఈ సినిమా కోసం సుక్కు చాలా కష్టపడ్డాడు. స్క్రిప్టు రెడీ చేశాడని దిల్ రాజు తెలిపారు.

స్క్రిప్టు వినగానే భయమేసింది

స్క్రిప్టు వినగానే భయమేసింది

అయితే సుకుమార్ తయారు చేసిన ‘జగడం' స్క్రిప్టు వినగానే భయమేసింది. ఏదో తప్పుగా వెలుతుందని పించింది. అయితే నేను వెంటనే నా నిర్ణయం చెప్పలేదు. ఆ స్క్రిప్టు బన్ని కూడా విని నాలాగే ఫీల్ అయ్యాడు.. అని దిల్ రాజు తెలిపారు.

సుక్కు ఫిక్సయితే అంతే...

సుక్కు ఫిక్సయితే అంతే...

స్క్రిప్టు ఏదో తప్పుగా వెలుతుందనే విషయాన్ని నేను, బన్ని కలిసి సుక్కుకు చెప్పాలనుకున్నాం. సుక్కు గురించి మాకు బాగా తెలుసు. ఆయన ఏదైనా ఫిక్స్ అయితే అందులో నుండి అతన్ని బయటకు తీసుకురావడం కష్టం. అతడు ఎక్స్ ట్రార్డినరీ రైటర్, కొత్తగా చేయాలని తపించే మనిషి. అందుకే ఆర్య లాంటి కొత్త కాన్సెప్టు మూవీ వచ్చిందని దిల్ రాజు తెలిపారు.

ఎంత చెప్పినా వినిపించుకోలేదు

ఎంత చెప్పినా వినిపించుకోలేదు

‘జగడం' స్క్రిప్టు విషయంలో మేము ఎంత చెప్పినా సుకుమార్ వినిపించుకోలేదు. ఒక స్టేజ్ లో సుక్కుకు, తనకు మధ్య ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేయకుంటే వేరే ప్రొడ్యూసర్ ను చూసుకుంటాను అనే స్థాయికి సుక్కు వెళ్లిపోయాడు. నేను కఠినంగానే ఉండటంతో రాత్రికి రాత్రే వేరే హీరో, వేరే ప్రొడ్యూసర్‌తో సినిమా ఫైనల్ చేశాడని దిల్ రాజు తెలిపారు.

రిలేషన్ పాడవ్వకూడదని

రిలేషన్ పాడవ్వకూడదని

సుక్కుతో తమ రిలేషన్ పాడవ్వకూడదని ‘జగడం' మూవీ ఓపెనింగుకు నేను, బన్నీ కలిసి వెళ్లాం. ‘జగడం' విడుదలైన తర్వాత సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అందరికీ తెలిసిందే.

అంతా పోగొట్టుకుని అప్పుల పాలైన దిల్ రాజు... మళ్లీ ఇండస్ట్రీలోకి ఎలా!

అంతా పోగొట్టుకుని అప్పుల పాలైన దిల్ రాజు... మళ్లీ ఇండస్ట్రీలోకి ఎలా!

1996లో హర్షిత ఫిల్మ్స్ అని ఓ బిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించిన దిల్ రాజు సంవత్సరంలో మూడు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సినిమాల కోసం 40 లక్షలు సొంతగా పెట్టుబడి పెట్టగా, మరో 40 లక్షలు అప్పు చేశారు. అయితే మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ కావడంతో 80 లక్షలు నష్టపోయారు. దీంతో సినిమా వ్యాపారాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారట.... మరి ఆ తర్వాత దిల్ రాజు ఎలా సక్సెస్ అయ్యారనే విషయాన్ని ఇటీవల ప్రేమ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Dil Raju about 'Jagadam' conflict with Sukumar. It was years back, when Sukumar was narrating Jagadam outline to Dil Raju, the then producer of the film. Sukku laughs out saying that he himself behaved like a child a that moment, refusing to make the changes suggested by Dil Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu